సినిమాల్లేవ్.. ఛాటింగులు ఎందుకు?

Update: 2017-02-27 19:05 GMT
మామూలుగా సినిమాలు చేస్తున్న సెలబ్రిటీలందరూ ఎప్పుడూ న్యూస్ లో నానిపోవాలి కాబట్టి.. అప్పుడప్పుడూ ట్విట్టర్ లో చాటింగ్ అని.. ఫేస్ బుక్ లో లైవ్ అంటూ.. ఏవో సెషన్లు చేస్తుంటారు. కాని వర్క్ నుండి రిటైర్ అయిపోయిన హీరోయిన్లు కూడా అలా చేయడం వలన పెద్దగా ఏమైనా ఉపయోగం ఉంటుందా?

టాలీవుడ్ లో ఎలాగైనా పెద్ద స్టార్ అయిపోవాలని అక్క ద్వారా ఎంట్రీ ఇచ్చింది నిషా అగర్వాల్. అయితే బ్రాండ్ కాజల్ ఆమెను ఇక్కడ కాపాడలేకపోయింది. దానితో రెండేళ్ళకే పెట్టేబేడా సర్దేసుకుని తన ప్రియుడ్ని పెళ్లిచేసుకుంది. కాకపోతే కామెడీ ఏంటంటే.. కాజల్ ఎప్పుడు ఫారిన్ షూట్ చేసినా కూడా.. కాజల్ వాళ్లమ్మతో పాటు చెల్లెకి కూడా టిక్కెట్లు తీయిస్తోంది. ఫారిన్ టూర్లకు తీసుకెళ్తోంది. దానితో ఇప్పుడు నిషా అగర్వాల్ కూడా ఇంకా హీరోయిన్ టైపులోనే ఫీలవుతూ.. ట్విట్టర్లో చాట సెషన్ అదీ ఇదీ అంటోంది.

ఆస్క్ నిషా అంటూ అమ్మడు హ్యాష్‌ ట్యాగులు ట్రెండ్ చేస్తూ.. అబ్బో నానా హడావుడి చేసింది. కొందరు అభిమానులు యాజూజువల్ గా ప్రశ్నలు వేయడం.. అలాగే అమ్మడు సమాధానాలు చెప్పడం. అబ్బో ఓ రేంజులో జరిగిందిలే. కాని ఈ చాటింగ్ ఎందుకు బేబీ.. కాస్త చెప్మా!!?
Tags:    

Similar News