240 వజ్రాలు..18 క్యారెట్ బంగారం అద్దకం.. 2.6 కోట్లు ఖరీదు.. ఇదీ హ్యాండ్ బ్యాగు అంటే! ఇంతకీ ఆ బ్యాగు ఎవరిది అంటారా? ది గ్రేట్ ముఖేష్ అంబానీ వైఫ్ నీతా అంబానీ హ్యాండు బ్యాగు డేటా ఇది. ఈ బ్యాగు ఖరీదు డాలర్లలో చెప్పాలంటే 2017 వేలంలో 380కె డాలర్లు పలికిందట. నీతా చేతికి చిక్కాక మరి ఈ రెండేళ్లలో ఇంకెంత రేటు పెరిగిందో!! అయినా రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా ఆ మాత్రం రేంజు మెయింటెయిన్ చేయకపోతే ఎంతటి నామోషీ?
ఈ బ్యాగుని `హెర్మ్ స్ హిమాలయా బిర్కిన్ బ్యాగ్` అని పిలుస్తున్నారు. తాజాగా నీతాతో కలిసి బాలీవుడ్ కథానాయికలు కరిష్మా కపూర్- కరీనాకపూర్ ఫోజిచ్చిన తీరు వెబ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో నీతాజీ చేతిలో ఉన్న ఆ హ్యాండు బ్యాగుపైనే అందరి కళ్లు. సోషల్ మీడియాలో దీని గురించి ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. ఇంతకీ ఈ బ్యాగుకి ఉపయోగించిన మెటీరియల్ ఏంటి? అంటే...
ఈ బ్యాగుని 18 క్యారెట్ బంగారం మెటల్ తో 240 వజ్రాల్ని పొదిగి తయారు చేయడం హైలైట్. అంతేకాదు ఈ బ్యాగు కోసం నైల్ నదిలో సంచరించే ఓ స్పెషల్ మొసలి (క్రొకడైల్) ఛర్మం రంగును ఉపయోగించారట. ఆ మేరకు ప్రఖ్యాత క్రిస్టీ డాట్ కాం వెబ్ సైట్ వివరాల్ని వెల్లడించింది. ఇక ఈ బ్యాగుకి ప్రఖ్యాత గాయని కం నటి బిర్కిన్ జేన్ పేరును పెట్టారట. ఈ బ్రాండ్ బ్యాగుల్ని కేవలం వరల్డ్ రిచెస్ సెలబ్రిటీలు మాత్రమే కొనుక్కోగలరు. హాలీ గ్రెయిల్ ఇన్ ఏ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కేటగిరీలో ది బెస్ట్ బ్యాగ్ ఇదేనట.