నితిన్ నటిస్తున్న హై వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ `మాచార్ల నియోజకవర్గం`. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ మూవీ ద్వారా ఎడిటర్ ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్నఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని స్పీడప్ చేశారు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ గుంటూరులో విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్ లో దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖరరెడ్డి కనిపించకపోవడం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. సినిమా రిలీజ్ ప్రకటించిన దగ్గరి నుంచి ప్రతీ ప్రమోషన్స్ లోనూ చురుగ్గా పాల్గొంటూ వస్తున్న ఎం.ఎస్. రాజశేఖరరెడ్డి ఉన్నట్టుండి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మిస్సయ్యారు. ఇంత వరకు తాను ఎన్ని సినిమాల ట్రైలర్ లని కట్ చేశానని, ఫస్ట్ టైమ్ తాను రూపొందించిన `మాచర్ల నియోజక వర్గం` ట్రైలర్ ని కట్ చేశానని, ఎలా వుందో చెప్పాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులని కోరారు.
అంతగా నితిన్ అభిమానుల్ని, నెటిజన్ లని ట్రైలర్ పై అభిప్రాయం వెల్లడించమని చెప్పిన దర్శకుడు ట్రైలర్ ఈవెంట్ లో మిస్ కావడం వెనక తాజాగా జరిగిన వివాదం కారణం అని తెలుస్తోంది. వైఎస్, రాజశేఖరరెడ్డి, వైస్ జగన్ లకు ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వీరాభిమాని. ఆ అభిమానంతో ఆ మధ్య ఏపీ ఎన్నికల ఫలితాల వేళ `కమ్మ, కాపు వర్గాలని దూషించినట్టుగా ఇటీవల ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఓ వర్గం దర్శకుడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
దీంతో ఈ ట్వీట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ ఐడీని క్రియేట్ చేసి ఫొటో షాప్ చేశారని దర్శకుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నితిన్ కూడా దీని ప్రభావం తన సినిమా పై పడుతుందని గ్రహించి వివాదం పెద్దది కాకుండా చూసే ప్రయత్నం చేశాడు. కానీ దర్శకుడు చేసిన ట్వీట్లే నని ఇప్పటికీ ఆ వివాదం నెట్టింట వైరల్ అవుతూనే వుంది. అంతే కాకుండా `మాచర్ల నియోజక వర్గం` సినిమాని `బైకాట్` చేయాలంటూ కొంత మంది నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
దీంతో అలర్డ్ అయిన నితిన్ సినిమా ప్రమోషన్ లకు దర్శకుడిని అవాయిడ్ చేయడమే మంచిదని భావించి ట్రైలర్ రిలీజ్ కు అతన్ని పక్కన పెట్టాడని తెలుస్తోంది. అంతే కాకుండా అతని ప్రస్తావన ఎక్కడా రాకుండా జాగ్రత్తపడ్డాడని స్పష్టమవుతోందని చెబుతున్నారు. గుంటూరులో పవన్ సపోర్టర్స్, టీడీపీ సపోర్టర్స్ ఎక్కువ ఆ విషయాన్ని గ్రహించిన నితిన్ కావాలనే దర్శకుడి పరుని ఎక్కడా వాడకుండా జాగ్రత్తపడ్డాడని తెలుస్తోంది.