యంగ్ హీరో నితిన్ పెళ్లికి రెడీ అయ్యాడు. ప్రేయసి షాలినితో చాలా కాలంగా ప్రేమలో ఉన్న నితిన్ పెద్దలను ఒప్పించి పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. దుబాయిలో డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటే కరోనా కారణంగా అక్కడ క్యాన్సిల్ అయ్యింది. పెళ్లి హైదరాబాద్ లోనే జరుగబోతుంది. నిన్న నితిన్ షాలినిల వివాహ నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువ మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగింది. నిన్న అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఈ ఫొటోను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘మై బేబీస్ ఆర్ ఎంగేజ్డ్.. షాదీ టైమ్’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను నీరజ షేర్ చేసింది. ఈ ఫొటోలో నితిన్ లుక్ కు చాలా డీసెంట్ గా సింపుల్ గా బాగుదంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సిల్క్ లాల్చీ మరియు పైజామా ధరించి మెడలో మ్యాచింగ్ హారం ధరించి వారెవ్వ అన్నట్లుగా నితిన్ ఉన్నాడు. ఎంగేజ్ మెంట్ తర్వాత జరిగిన సంగీత్ పార్టీలో నితిన్ ఇలా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో షాలిని మెడలో మూడు ముళ్లు వేసి ఒక ఇంటి వాడు కాబోతున్న నితిన్ కు ఆల్ ది బెస్ట్.