'లై' నిజమని తేలుతుందా??

Update: 2017-08-12 09:26 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం యువ హీరోల మధ్య పోటీ మాములుగా లేదు. రానా - శ్రీనివాస్ వారి వారి స్థాయిలో వారు కలెక్షన్స్ రాబడుతుంటే నితిన్ మాత్రం బాక్స్ ఆఫీస్ పై వేరే స్టయిల్లో కన్నేశాడు. అయితే మొదటి రోజు మాత్రం కలక్షన్ల పరంగా నేనే రాజు నేనే మంత్రి హవా కనిపించి.. లై సినిమా కాస్త వెనుకబడింది. దీనికి కారణం ప్రమోషన్లు తక్కువగా చేయడమే అయ్యుండొచ్చు.

నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "లై" సినిమా ప్రేక్షకులను చాలా అకట్టుకుంటోందని, ఈ సినిమాలో అర్జున్ నటన మరియు నితిన్ హీరోయిజం మేజర్ ప్లస్ పాయింట్. యాక్షన్ సీన్స్ తో పాటు హీరో- హీరియిన్స్ సాగే ప్రేమ కథతో పాటు హీరో మరియు అర్జున్ కి మధ్య వచ్చే సన్నివేశాలు దర్శకుడు బాగా తెరకెక్కించాడు. సినిమాలో కాస్ట్ లీ విజువల్స్- ట్విస్ట్- స్క్రీన్ ప్లే లో కొత్తదనం ఉండడం వల్ల ఎ-సెంటర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రాబ్లమ్ అంతా బి-సి సెంటర్లతోనే. విషయం ఏంటంటే.. సినిమాకు శనివారం హైదరాబాద్ వంటి నగరాల్లో ఆక్యుపెన్సీ రేట్ ఉన్నట్లుండి పెరిగింది. శుక్రవారం ఓపెనింగ్స్ తక్కువొచ్చాయ్ కాని.. శనివారం మాత్రం మౌత్ టాక్ బాగుండటంతో ఆటోమ్యాటిక్ గా ఊపందుకుంది. మరి బి-సె సెంటర్లలో పరిస్థితి ఏంటనేది రెండో రోజు కలక్షన్ల గ్రాఫ్‌ చూస్తేకాని తెలియదులే.

అసలే ఇండిపెండన్స్ డే వీకెండ్ కాబట్టి.. పాజిటివ్ టాక్ కాస్త వచ్చినా కూడా సినిమాకు ఈ నాలుగు రోజులు హౌస్ ఫుల్ కలక్షన్లే ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే.. నిధానంగా స్టార్ట్ అయిన 'లై' సినిమా నెమ్మదిగా ప్రభావం చూపించే ఛాన్సుంది. కాకపోతే సినిమాను భారీ బడ్జెట్ ను వసూలు చేయాలి కాబట్టి.. ఈ ప్రభావం ఎంత గట్టిగా చూపిస్తే అంత వర్కవుట్ అవుతుంది. అది సంగతి.
Tags:    

Similar News