టాలీవుడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ పై అప్పుడప్పుడు రకరకాల రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఫలానా హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడని.. పెళ్లికి రెడీ అవుతున్నాడని కథనాలొచ్చాయి. అయితే నితిన్ రియల్ లవ్ షాలిని గురించి మాత్రం తాను స్వయంగా చెప్పే వరకూ ఎవరికీ తెలియదు. అంటే షాలిని విషయంలో నితిన్ ఎంత కేర్ ఫుల్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాబాద్ ఔటింగులు కానీ...విదేశీ షికార్లు కానీ అస్సలు లీకవ్వనేలేదు ఇన్నాళ్లలో. కలిసి జంట షికార్లకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా లీకవ్వలేదు. మరి ఈ జంట అసలు షికార్లే చేయలేదా? ప్రేమ పావురాలు కలుసుకునే వేదిక అన్నదే ఏదీ లేదా? అంటే ఆసక్తికర సంగతులే బయటకు వస్తున్నాయి.
లవ్ లో టాప్ సీక్రెట్స్ అన్నింటినీ నితిన్ స్వయంగా ఓ ఇంటర్వూలో వెల్లడించాడు. నితిన్ హీరో కావడంతో షాలినిని పెద్దగా బయట ఎక్కడా తిప్పలేదుట. షాలిని ఆ విషయంలో ఎంత మొత్తుకున్నా వినేవాడు కాదట. ఆ సమయంలో కాస్త కోపగించుకున్నా తర్వాత కూల్ అయ్యేదిట. విదేశాల్లో గానీ...హైదరాబాద్ లో గానీ కలిసి తిరగలేదని.. కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు కూడా చాలా తక్కువేనని అన్నాడు. ఒక వేళ ఫోటోలు దిగినా.. కేవలం ఫోన్ లోనే నిక్షిప్తమై ఉండేవట. ఎవరికంట పడినా సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంతా ఇంతా కాదని..అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపాడు.
ఇక ఈ జంట ప్రేమ వేదిక గురించి ఆసక్తికర సంగతి తెలిసింది. హైదరాబాద్ లో ఉన్న ఖరీదైన పార్క్ హయత్ హోటల్లో మాత్రం నిరంతరం డిన్నర్లకు కలిసేవారట. నితిన్ షూటింగ్ లు లేనప్పుడు హయత్ లోనే ఇద్దరు కలిసి సమయం గడిపేవారు. అక్కడ తప్ప హైదరాబాద్ లో వేరొక రెస్టారెంట్ లో గానీ...హోటల్ లో గానీ కలవలేదని అసలు గుట్టు విప్పాడు. హయత్ హోటల్ పైనా పెంట్ హౌస్ లా ఓ చిన్న రెస్టారెంట్ కూడా ఉందని తెలుగు సినీమీడియాకే తెలియని సీక్రెట్ ప్లేస్ గురించి లీక్ చేసేశాడు. హోటల్ టాప్ లో కలిసి తినే వాళ్లమని.. తమ మధ్య ప్రేమ భావనల్ని పంచుకునే వాళ్లమని ..తన వల్ల షాలిని సినిమాలు...షికార్లు చాలా మిస్ అయిందని నితిన్ తెలిపాడు. మొత్తానికి నితిన్ ఒక మౌనమునిలా ప్రేమించాడని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.