నితిన్ రెస్టారెంట్.. భలే క్లిక్కయిందే

Update: 2016-12-08 05:25 GMT
సినీ ప్రముఖులు తమ ఆదాయాన్ని వ్యాపారాల్లోకి మళ్లించడం మామూలే. వాళ్లను ప్రధానంగా ఆకర్షించేది రెస్టారెంట్ బిజినెస్సే. యువ కథానాయకుడు నితిన్ కూడా ఆ బాటలోనే నడిచాడు. ప్రముఖ స్టైలిస్ట్.. తన ఫ్రెండ్ అయిన నీరజ కోనతో కలిసి మాదాపూర్లో ‘టి గ్రిల్’ పేరుతో గత నెలలోనే రెస్టారెంట్ ఆరంభించాడు నితిన్. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ రెస్టారెంట్ బాగా పాపులర్ అయిపోయింది.

భిన్నమైన.. ఆహ్లాదకరమైన యాంబియన్స్.. టేస్టీ ఫుడ్ వల్ల ఈ రెస్టారెంట్ ఇన్ స్టంట్ హిట్టయిపోయింది. నితిన్ ఎక్కణ్నుంచి పట్టుకొచ్చాడో కానీ.. చెయ్యి తిరిగిన చెఫ్స్ ను తీసుకొచ్చి రెస్టారెంట్ బాధ్యతల్ని అప్పగించాడు. వాళ్లు చేస్తున్న ఐటెమ్స్.. కస్టమర్లను మళ్లీ మళ్లీ రెస్టారెంటుకు బాగానే రప్పిస్తున్నాయట. చాలామంది సినీ ప్రముఖులకు ఇప్పుడు నితిన్ రెస్టారెంట్ రెగులర్ మీటింగ్ ప్లేస్ అయిపోయింది. మాదాపూర్ చుట్టూ ఉండే యూత్ కూడా నితిన్ రెస్టారెంటు వైపే చూస్తున్నారు. సాఫ్ట్ వేర్ జనాల్ని ‘టి గ్రిల్’ బాగా ఆకర్షిస్తున్నట్లు సమాచారం.

ఆరంభమైన కొన్ని రోజులకే మంచి ఫ్లోటింగ్ తెచ్చుకున్న ‘టి గ్రిల్’.. రోజూ కస్టమర్లతో కళకళలాడుతోంది. ఈ రెస్టారెంట్ నితిన్ పెట్టాడనో.. సెలబ్రెటీలు వస్తారనో.. మొదట్లో జనాలు పెద్ద ఎత్తున రావచ్చేమో కానీ.. కస్టమర్లను నిలబెట్టేది మాత్రం వంటకాల రుచే. ఆ విషయంలో ‘టి గ్రిల్’కు ఢోకా లేనట్లే ఉంది. సిటీలో ఎక్కడ కొత్త రెస్టారెంట్ పడ్డా వెళ్లి టేస్ట్ చేసి వచ్చే ఓ ఫిల్మ్ క్రిటిక్.. ‘టి గ్రిల్’లో వంటకాలు సూపర్బ్ అని.. ఈ మధ్య కాలంలో ఇంత ఫుల్లుగా తాను ఎక్కడా తినలేదని కితాబివ్వడం విశేషం.
Tags:    

Similar News