షాకింగ్ లీక్: త‌లైవి జ‌య‌ల‌లిత లుక్ ఇదేనా?

Update: 2019-09-27 08:10 GMT
అమ్మ జ‌య‌ల‌లిత‌పై సినిమా అంటే పాన్ ఇండియా సినిమాగానే భావించాల్సి ఉంటుంది. జాతీయ‌స్థాయి ఛ‌రిష్మా ఉన్న క‌థానాయిక‌గా రాజ‌కీయ నాయ‌కురాలిగా జ‌య‌ల‌లిత‌కు పాపులారిటీ ఉంది. అందుకే తెలుగు-త‌మిళం-హిందీలోనూ ఈ సినిమాల్ని రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్రిప‌రేష‌న్స్ సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌పై ఒకేసారి రెండు బ‌యోపిక్ లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. కంగ‌న క‌థానాయిక‌గా ఏ.ఎల్.విజ‌య్ తెర‌కెక్కిస్తున్న బ‌యోపిక్.. నిత్యా మీన‌న్ క‌థానాయిక‌గా ప్రియ‌ద‌ర్శ‌ని రూపొందిస్తున్న బ‌యోపిక్ సెట్స్ కెళ్లేందుకు రెడీ అవుతున్నాయి. ఇవి రెండూ ప్ర‌స్తుతం కీల‌క‌మైన ఫేజ్ లో ఉన్నాయి. ప్రీప్రొడ‌క్ష‌న్స్ ముగించుకుని సెట్స్ కెళ్లే ముందు ప్రిప‌రేష‌న్స్ సాగిస్తున్నారు. అమ్మ జ‌య‌ల‌లిత‌లా క‌నిపించేందుకు అవ‌స‌ర‌మైన ప్రిప‌రేష‌న్స్ సాగిస్తున్నారు.

ఇటీవ‌లే కంగ‌న అమెరికా వెళ్లి అక్కడ హాలీవుడ్ మేక‌ప్ నిపుణుల స‌మ‌క్షంలో ప్రోస్త‌టిక్స్ ప్రిప‌రేష‌న్ సాగించింది. త‌లైవి లుక్ లో తాను ఎలా క‌నిపిస్తుందో చెక్ చేసుకుంది. అయితే వేరొక బ‌యోపిక్ లో నిత్యామీన‌న్ లుక్ ఎలా ఉండ‌బోతోంది? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు. ఇంత‌కు ముందు ది ఐర‌న్ లేడీ పేరుతో నిత్యా ముఖ‌చిత్రాన్ని పోస్ట‌ర్ గా వేసినా.. అప్ప‌టికి నిత్యా త‌న పాత్ర‌కోసం ప్రిపేర‌య్యింది లేదు. ఇప్ప‌టికి నిత్యా ప్రిప‌రేష‌న్ సాగుతోంద‌ని తాజాగా రిలీజైన ఓ ఫోటో చెబుతోంది. ఇదీ నిత్యామీన‌న్ ఇలా ఉండ‌బోతోంది అని చూపించే స్కెచ్ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది.

క‌థానాయిక‌గా ఉన్న‌ప్పుడు అమ్మ లుక్ వేరు. మిడిలేజీలో అమ్మ లుక్ వేరే. రాజ‌కీయ నాయ‌కురాలిగా ప‌రిణ‌తి చెందినపుడు జ‌య‌ల‌లిత లుక్ వేరు. అందులో ఒక రూపం ఇదిగో ఇలా ఉండ‌బోతోంద‌ని స్కెచ్ ని వేశారు. అది ఇలా సోష‌ల్ మీడియాలోకి లీక్ అయ్యింది. ఇందులో నిత్యా క‌నిపిస్తోంది. అమ్మ‌లా మారిన నిత్యా కనిపిస్తోంది ఒక ర‌కంగా. ఆ పెయింటింగ్ వేసిన ఆర్టిస్టు ఎవ‌రో ప‌నిత‌నం బాగానే చూపించారు. ఒక‌వేళ నిత్యా అలా మారాక చేసిన ఫోటో షూట్ నుంచి ఫోటోనా? అన్న‌ది కూడా తెలియాల్సి ఉంది. ఆరుసార్లు త‌మిళ‌నాడును ముఖ్య‌మంత్రిగా ఏలిన ది గ్రేట్ నాయ‌కురాలు జ‌య‌ల‌లిత‌పై సినిమా అంటే మాజాకానా?  కొన్ని కోట్ల మంది త‌మిళ ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడు అది. అందుకే మేక‌ర్స్ అంత జాగ్ర‌త్త తీసుకుని తెర‌కెక్కిస్తున్నార‌ని భావించాల్సి ఉంటుంది. కీర్తి సురేష్ ను మ‌హాన‌టి సావిత్రిగా ఆవిష్క‌రించేందుకు నాగ్ అశ్విన్- అశ్వ‌నిద‌త్ బృందం చేసిన ప్ర‌య‌త్నాన్ని మించి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ కోసం చేస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా. తాజాగా రివీలైన నిత్యా స్కెచ్ చూస్తుంటే అమ్మ బ‌యోపిక్ కి త‌న‌కంటే యాప్ట్ ఇంకొక‌రు ఉండ‌రని అనిపిస్తోంది క‌దూ?



Tags:    

Similar News