భీమ్లాభామ‌ని లాక్ చేసిన అర‌వింద్!

Update: 2022-02-17 23:30 GMT
ఓటీటీ  ప్లాట్ ఫాం `ఆహా`ని ఓ రేంజ్ లో పైకి లేపే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఎంత మాత్రం రాజీ లేకుండా `ఆహా` కోసం నిరంత‌రం వ్య‌వ‌స్థాప‌కులు అల్లు అర‌వింద్ శ్రమిస్తున్నారు. రెగ్యుల‌ర్ ఓటీటీ ఎంట‌ర్ టైన్ మెంట్ ల‌కు భిన్నంగా  డిఫ‌రెంట్ కంటెంట్ అందించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే త‌న సినిమా ప్ర‌మోష‌న్ కి త‌ప్ప బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌ని నంద‌మూరి బాల‌కృష్ణ‌ని ఒప్పించి `అన్ స్టాప‌బుల్` ప్రోగ్రామ్ నిర్వ‌హించారంటే అర‌వింద్ ఎంత కమిట్ మెంట్ తో ఉన్నారో అర్ధం అవుతుంది. ఓటీటీ వేదిక‌ల‌పైనే ఇదొక డిఫ‌రెంట్  ప్రొగ్రామ్ గా చేప‌ట్టి  పెద్ద స‌క్సెస్ అందుకున్నారు.

దీంతో  `ఆహా` ఒక్క‌సారిగా అలా పైకి లేచింది. ఇక సొంతింట్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎలాగూ ఉన్నారు. మ‌రోవైపు అత‌ని ప్ర‌య‌త్నాలు అత‌ను చేస్తూనే ఉన్నారు. `ఆహా`కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగుతున్నారు బ‌న్నీ. తాజాగా ఆహా మ్యూజిక్ రియాల్టీ షోనే ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఇండియ‌న్ ఐడ‌ల్` పేరుతో ఆహా నిర్వాహ‌కులు కొత్త మ్యూజిక్ రియాల్టీ షో చేస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. మ్యూజిక్  డైరెక్ట‌ర్ థ‌మ‌న్ ఈ రియాల్టీ షోకి ఒక న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. తాజాగా మ‌రో హోస్ట్ ని  ని ప‌రిచ‌యం చేస్తూ కొత్త ప్రోమోని రిలీజ్ చేసారు.

ఇండియ‌న్ ఐడ‌ల్ తెలుగు వెర్ష‌న్ కి హీరోయిన్..గాయ‌ని.. నిత్యామీన‌న్ ని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ మొత్తం షో హోస్టింగ్ బాధ్య‌త‌లు ఇండియ‌న్ ఐడిల్ విజేత  శ్రీరామ‌ చంద్ర‌కు అప్ప‌గించారు. అతి త్వ‌ర‌లోనే ఈ షో ప్రారంభం కానుంది. దానికి సంబంధించి `ఆహా `నిర్వ‌హ‌కులు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నారు. ఇక నిత్యా మీన‌న్ ఎంట్రీతో  రియాల్టీ  మ్యూజిక్ షోకి అద‌న‌పు హంగులు యాడ్ అయ్యాయి.

నిత్యా మీన‌న్ న‌టిగా రాణిస్తునే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు గొంతును స‌వ‌రిస్తుంది. ప‌లు సినిమాల్లో పాట‌లు పాడిన అనుభ‌వం ఉంది. అందుకే ఈ మ్యూజిక్ షోకి రెండ‌వ న్యాయ నిర్ణేత‌గా అవ‌కాశం క‌ల్పించారు.

నిత్యా మీన‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `భీమ్లా నాయ‌క్` లో న‌టిస్తోంది. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా క‌నిపించ‌నుంది. ప్ర‌స్తుతానికి తెలుగులో ఈ ఒక్క సినిమానే చేస్తోంది. ఇత‌ర భాష‌ల్లోనూ కొన్ని సినిమాలు చేస్తోంది. మ‌ల‌యాళంలో ఒక సినిమా.. త‌మిళ్ లో  రెండు సినిమాలు చేస్తోంది. నిత్యా మీన‌న్ తాజా గ్రాఫ్ ని ప‌రిశీలిస్తే హీరోయిన్ గా  వెనుక‌బ‌డే ఉంది.

ఆ మ‌ధ్య బాగా బొద్దురూపం లోకి మారిపోయిన బ్యూటీ త‌ర్వాత శ‌రీరంలో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఎంతో క‌ష్ట‌ప‌డి రూప లావ‌ణ్యంలో మార్పులు తెచ్చింది.  ఆ స‌మ‌యంలోనే అవ‌కాశాలు రాలేదు. మ‌ళ్లీ కొంత గ్యాప్ త‌ర్వాత ట్రాక్ లోకి వ‌చ్చింది.
Tags:    

Similar News