బిజినెస్‌ నుండి తప్పుకున్నావా నితిన్‌?

Update: 2016-04-19 09:30 GMT
సడన్ గా ఈ రోజు తెలిసిన విషయం ఏంటంటే.. తమిళ ప్రొడ్యూసర్‌.. హీరో సూర్య కజిన్‌.. జ్ఞానవేల్‌ రాజా.. డైరెక్టుగా తన 'స్టూడియో గ్రీన్‌' సంస్థ ద్వారా.. వైజాగ్‌ - వెస్ట్‌ - ఈస్ట్‌ వంటి జిల్లాల్లో ''24'' సినిమాను తానే స్వయంగా సూర్య కోసం రిలీజ్‌ చేస్తున్నాడు. మరి ఈ సినిమాను తెలుగు రాష్ట్రంలలో రిలీజ్ చేయడానికి కొనుకున్న హీరో నితన్‌ ఏమైనట్లు?

నిజానికి 'మే 6' అనే డేటు చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు అన్నీ ఇన్నీ కాదు. ఆ డేట్‌ న ఒకవేళ ''బ్రహ్మోత్సవం'' సినిమా రాకపోతే తన ''అ..ఆ'' సినిమాను విడుదల చేయాలని ఎప్పటి నుండో వెయిట్‌ చేస్తున్నాడు నితిన్‌. అయితే సడన్‌ గా సూర్య స్వయంగా ప్రెస్‌ మీట్‌ పెట్టేసి.. మా సినిమాను మే 6న రిలీజ్ చేస్తున్నాం అంటూ నిన్న ప్రకటించేశాడు. ఇదంతా నితిన్‌ కు అస్సలు నచ్చలేదట. అందుకే ఈ సినిమా తెలుగు వర్షన్‌ రైట్స్‌ కొనుకున్న నితిన్‌.. సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి స్వయంగా స్టూడియో గ్రీన్‌ డైరక్టు రిలీజ్‌ ప్లాన్‌ చేస్తోంది.

పైగా ఈ మధ్యన చాలామంది పెద్ద సంస్థల వారు తమ సినిమాలను తామే స్వయంగా రిలీజ్‌ చేసుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ సోగ్గాడే చిన్ని నాయనా.. పివిపి ఊపిరి.. ఇలాగే రిలీజ్‌ అయ్యాయ్‌. అందుకే ఇప్పుడు 24 సినిమాను కూడా స్టూడియో గ్రీన్‌ తో డైరెక్టుగా రిలీజ్‌ చేద్దామని సూర్య కూడా భావించినట్లు తెలుస్తోంది. మరి నితిన్‌ ఏమంటాడో చూడాలి.
Tags:    

Similar News