ఆర్మీ నుండి అఖండ వరకు అలా అలా...!

Update: 2022-07-09 10:07 GMT
సినిమా ఇండస్ట్రీలో అదృష్టంను పరీక్షించుకునేందుకు ప్రతి రోజు ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సినిమా ల్లో కేవలం నటులుగా మాత్రమే కాకుండా టెక్నీషియన్ గా అయినా సెటిల్‌ అవ్వాలని ప్రయత్నించే వారు చాలా మంది ఉంటారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రయత్నించినా కూడా క్లిక్‌ అవ్వని వారు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉంటారు.

పదుల సంవత్సరాలుగా కూడా బ్యాక్ గ్రౌండ్‌ ఆర్టిస్టుగా లేదంటే జూనియర్ ఆర్టిస్టుగానే కెరీర్‌ ను కొనసాగిస్తూ ఉంటారు. కాని కొందరు మాత్రం అనూహ్యంగా అదృష్టం కలిసి వచ్చి పెద్ద సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తారు. అలా వారి కెరీర్‌ టర్న్‌ అవుతుంది. అయితే వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చిన అదృష్టం కు సఫలత ఉంటుంది.

అఖండ సినిమా లో విలన్ పాత్ర గజేంద్ర సాహూ అనే పాత్రలో కనిపించిన వ్యక్తి నితిన్‌ మెహతా. ఈయన సినీ రంగ ప్రవేశం చాలా నాటకీయ పరిణామాల మధ్య సాగిందట. సినిమాల్లో నటించాలనే ఉద్దేశ్యం కాని.. ఆసక్తికాని లేకుండానే ఆఫర్లు వచ్చాయట. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పి అందరిని ఆశ్చర్యపర్చాడు.

నితిన్ మెహతా మాట్లాడుతూ.. నేను 21 సంవత్సరాల పాటు ఆర్మీ లో కొనసాగాను. ఆ సమయంలో నేను దేశం గురించి మరేం ఆలోచించలేదు. ఆర్మీ నుండి రిటైర్‌ అయ్యాక నా లుక్‌ మార్చాను.

సరదాగా మార్చిన లుక్ హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఒక దర్శకుడు చూసి నచ్చాడు. ఆయన ఢిల్లీలో ఒక మోడలింగ్ షో కు తీసుకు వెళ్లాడు. అక్కడ నుండి నా జర్నీ మొదలు అయ్యింది.

పలు కంపెనీల యొక్క ప్రమోషనల్ వీడియోల్లో కూడా నటించాను. అనూహ్యంగా బాలకృష్ణ గారి అఖండ సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చిన నితిన్‌ మెహతా త్వరలోనే పవన్ కళ్యాణ్.. చిరంజీవి గారు వంటి ప్రముఖ స్టార్స్ తో కలిసి నటించాలని కోరుకుంటున్నాను అన్నాడు.
Tags:    

Similar News