ఇన్నాళ్లు ఓపికగా వెయిట్ చేసిన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆ ఓపిక నశించడంతో పూర్తి అయిన తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు. థియేటర్లు ఓపెన్ కోసం ఆరు నెలలుగా ఓపికగా ఎదురు చూసిన వారు ఇంకా ఎన్నాళ్లకు ఓపెన్ అవుతాయో తెలియక పోవడంతో ఓటీటీ దారి పడుతున్నారు. మొదట చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో విడుదల అయ్యాయి. 'వి' సినిమా తర్వాత మీడియం రేంజ్ సినిమాలు పాతిక కోట్ల బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీ విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇన్న రోజులు వద్దన్న హీరోలు కూడా ఇక వదిలేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాని హీరో నితిన్ మాత్రం ఇంకా ఓటీటీ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయన చేస్తున్న 'రంగ్ దే' సినిమాను ఓటీటీ లో విడుదల చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.
రంగ్ దే సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరిగాయి. బ్యాలన్స్ ఉన్న షూటింగ్ ను వచ్చే నెలలో పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయబోతున్నారు. ఇదే సమయంలో ప్రముఖ ఓటీటీ ల నుండి ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నాయట. పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువగానే ఓటీటీ కోట్ చేశాయట. కాని ఇప్పటి వరకు మేకర్స్ ఎవరికి కూడా ఓకే చెప్పలేదంటూ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు ఇంకా సమయం ఉంది. కనుక అప్పటి వరకు ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా నితిన్ అండ్ టీం వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల నుండి థియేటర్లు ఓపెన్ అయితే నవంబర్ లేదా డిసెంబర్ లో సినిమాను థియేటర్లలోనే విడుదల చేద్దాం లేదంటే అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిద్దాం అనే ఆలోచనతో ఉన్నారట.