నిత్యా హ‌గ్.. ఇంత‌కీ ఎవ‌రీయ‌న‌?

Update: 2019-03-09 16:46 GMT
ఒకే ఒక్క హ‌గ్గుతో కోటి సందేహాల‌కు తావిచ్చింది నిత్యా. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌?   రింగుల జుత్తు సుంద‌రి అంత‌గా హ‌గ్ చేసుకుంది? అంటూ ముచ్చ‌టించుకుంటున్నారు.  సౌత్ లో నిత్యా కెరీర్ ద‌శాబ్ధానికి చేరువైంది. ఇన్నేళ్ల‌లో ఏనాడూ  త‌న స్నేహితుల గురించి కానీ, కుటుంబ స‌భ్యుల గురించి కానీ, బోయ్ ఫ్రెండ్ గురించి కానీ ఏనాడూ బ‌హిరంగంగా క్లూ ఇవ్వ‌నే లేదు. కానీ ఉన్న‌ట్టుండి చాలా గ్యాప్ త‌ర్వాత ఇలా ఆ ఒక్క ఫోటోని షేర్ చేసి అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడేందుకు స‌సేమిరా అనే నిత్యా ఉన్న‌ట్టుండి ఇలా ఓ అంద‌గాడైన‌ యువ‌కుడితో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం .. పైగా అంత ఘాటైన‌ కౌగిలింత ఇవ్వ‌డం చూస్తుంటే అంద‌రిలో ఒక‌టే సందేహం.

అత‌డేనా నిత్యాకు కాబోయే వాడు? అంటూ సందేహం వ్య‌క్తం చేస్తున్నారంతా. అయితే అత‌డి గురించి నిత్యా త‌న‌దైన శైలిలో షాక్ ఇచ్చే వివ‌రం చెప్పింది. ధ్యానం నేర్పించే `ఓ అండ్ ఓ అకాడెమీ`... `వ‌న్ నెస్ యూనివ‌ర్శిటీ` అనే రెండు స్కూల్స్ గురించి చెబుతూ `మెడిటేష‌న్ & ఫిలాస‌ఫీ` క్లాసుల్లో అత‌డు నాకు స్నేహితుడు అంటూ నిత్యా చెప్పింది. అత‌డి పేరు ఒలివ‌ర్ కాల్‌హాన్. హాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తుంటాడు. చాలా కాలంగా త‌న‌కు స్నేహితుడు అట‌. ``ఫ్రెండ్స్.. ప్రేమ & స్నేహం`` అంటూ ఆస‌క్తిక‌ర‌మైన క్యాప్ష‌న్ ని ఆ ఫోటోకి ఇచ్చింది నిత్యా.

ఆ కుర్రాడితో నిత్యా ప్రేమ‌లో ఉందో లేదో తెలీదు కానీ, ఆ హ‌గ్ మాత్రం `ల‌వ్ లీ`గా ఉంది అంటూ అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో కామెంట్లు చేస్తున్నారు. `హార్ట్ బ్రేక్` అంటూ కొంద‌రు మీమ్స్ ని పోస్ట్ చేశారు. ఎవ‌రాయ‌న‌? అంటూ తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపించారంతా. అయితే నిత్యా చివ‌రిలో ఆ ఆస‌క్తిక‌ర ట్విస్టునే ఇచ్చింది. ``అత‌డు స్నేహితుడు.. అంతేకాదు నాకు లిటిల్ బ్ర‌ద‌ర్`` అంటూ బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. ఆ ఒక్క ట్విస్టుతో కుర్రాళ్ల‌కు కాస్త ఊపిరి స‌లిపే అవ‌కాశం క‌ల్పించింది. నిత్యా మీన‌న్ ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో టైటిల్ పాత్ర‌ధారిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ్‌, తెలుగు ద్విభాషా చిత్రంగా ఇది తెర‌కెక్కుతోంది.
    

Tags:    

Similar News