నిత్యా మీనన్ నిప్పు రాజేసిందిగా..

Update: 2016-08-13 06:08 GMT
నిత్యా మీనన్ ఒక ఫైర్ బ్రాండ్. మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు ముందు వెనుక చూసుకోకుండా వ్యాఖ్యలు చేసేస్తుంది. తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన తొలి రోజుల్లో ప్రభాస్ గురించి అడిగితే.. ఎవరతను అని అడగడం.. సీనియర్ హీరో వెంకటేష్ గురించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా ఒకట్రెండు సందర్భాల్లో నిత్యా యాటిట్యూడ్ చూపించింది. తాజాగా ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుక సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. తెలుగులో తొలిసారి ఓ ‘పెద్ద’ హీరో సరసన నటిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే నడుస్తోందిపుడు.

నిత్యా ఆల్రెడీ అల్లు అర్జున్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చేసింది. అతనూ స్టార్ హీరోనే. అదీ పెద్ద సినిమానే. ఆ సంగతి మరిచిపోయి మాట్లాడిందో లేక ఇంకేదైనా ఉద్దేశముందో కానీ.. ‘జనతా గ్యారేజ్’ ఆడియో వేడుకలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశం అవుతున్నాయి. ‘‘ఇంత పెద్ద వేడుకలో ఇంతమందిని ఒకేసారి చూడటం ఇదే తొలిసారి. పెద్ద హీరోతో సినిమా చేయడం ఇదే తొలిసారి. ఎన్టీఆర్‌ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని చాలామంది నన్ను అడిగేవాళ్లు. ఇన్నాళ్లకు నాకు ఆ అవకాశం వచ్చింది. కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు చేయాలని నా కోరిక. కొరటాల శివగారు ఆ కోరిక తీర్చారు. ఇదొక కంటెంట్ డ్రివెన్ సినిమా. ప్రతి ఒక్కరికీ మంచి పాత్రలు దక్కాయి. హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు డిజైన్ చేశారు. సినిమాటోగ్రాఫర్ తిరు నాకు చాలా నచ్చేశారు. నేను సొంతంగా ఓ సినిమా చేయాలనుకుంటే ఆయనతోనే పని చేస్తా’’ అని నిత్య అంది.
Tags:    

Similar News