వెండితెరపై రెండు రకాల కథానాయికలు కనిపిస్తారు. అందాలు ఆరబోస్తూ అవకాశాలను కొట్టేసే కథానాయికలు కొందరైతే, అభినయానికి ప్రాధాన్యతనిస్తూ ఆ తరహా పాత్రలను మాత్రమే చేసే కథానాయికలు మరికొందరు. నివేదా థామస్ రెండో వర్గానికి చెందిన కథానాయికగా కనిపిస్తుంది. ఓ సౌందర్య .. భూమిక .. నిత్యామీనన్ .. సాయిపల్లవి మాదిరిగా నివేదా థామస్ నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ వస్తోంది. అభినయానికి అనుకూలమైన కళ్లు .. అందమైన నవ్వు ఆమె సొంతం. తెరపై ఆమె పాత్రలు చాలా నీట్ గా .. డీసెంట్ గా కనిపిస్తాయి.
మొదటి నుంచి కూడా నివేదా థామస్ తమిళ .. మలయాళ సినిమాలను ఎక్కువగా చేస్తూ వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ ఉంది. అక్కడ తన జోరును కొనసాగిస్తూనే, టాలీవుడ్ పై ఒక లుక్కేసింది. అలా నాని 'జెంటిల్ మేన్' సినిమాతో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఈ సినిమాతో పాటు ఆ తరువాత ఆమె చేసిన 'నిన్నుకోరి' .. 'జై లవకుశ' .. 'బ్రోచేవారెవరురా' సినిమాలు కూడా భారీ విజయాలను అందుకున్నాయి. బరువైన పాత్రలను .. సున్నితమైన హావభావాలను ఆమె అద్భుతంగా చేయగలదనే పేరు తెచ్చుకుంది.
నివేదా థామస్ క్రితం ఏడాది చేసిన 'వి' సినిమాకి ఆశించినస్థాయిలో ఆదరణ లభించలేదు. ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన 'వకీల్ సాబ్' త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. అయితే కొంతకాలంగా నివేదా థామస్ కి అవకాశాలు తగ్గుతున్నాయనే సూచనలు కనిపిస్తూనే వస్తున్నాయి. అందుకు తగినట్టుగానే కొత్త ప్రాజెక్టులలో ఆమె పేరు పెద్దగా కనిపించడం లేదు .. వినిపించడం లేదు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండులో నటన కంటే ఆటపాటలతో ఆరబోసే అందాలకు ప్రాధాన్యత ఎక్కువ. నిత్యామీనన్ వెనకబడిపోవడానికి గల కారణం కూడా ఇదే. నటన ప్రధానమైన పాత్రలు వెతుక్కుంటూ వచ్చేవరకూ ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు వెయిట్ చేయవలసిందే.