మ‌నుషులున్నంత వ‌ర‌కూ మ‌నుగ‌డ‌ పోరాటం త‌ప్ప‌దు!

Update: 2021-10-21 03:56 GMT
టాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌ల క‌ళ్లన్నీ ఇప్పుడు మాలీవుడ్ కంటెంట్ పై ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కంటెంట్ బేస్డ్ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేసి స‌క్సెస్ కొట్టాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి మల‌యాళ‌ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫ‌ర్` రీమేక్ `గాడ్ ఫాద‌ర్` లో న‌టిస్తున్నారు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో హిట్ చిత్రం `అయ్య‌ప్పనం కోషియం` రీమేక్ గా వ‌స్తోన్న `భీమ్లా నాయ‌క్` లో న‌టిస్తున్నారు. ఇలా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు ఒకేసారి మ‌ల‌యాళం సినిమాల్లో న‌టించ‌డంతో టాలీవుడ్ మేక‌ర్స్ క‌ళ్లు అక్క‌డి చిత్రాల‌పై ఫోక‌స్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌ల‌యాళం యంగ్ స్టార్ నివిన్ పాళీ పేరు హాట్ టాపిక్ గా మారింది.

నివిన్ పాళీ హీరోగా `ప‌డ‌వేట్టు` అనే చిత్రం తెర‌కెక్కుతోంది. లిజు కృష్ణ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈసినిమా స్టోరీ ఏంట‌న్న‌ది ట్విట‌ర్ వేదిక‌గా రివీల్ చేసారు. అలాగే ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ ని కూడా ఆవిష్క‌రించారు. ` సంఘ‌ర్ణ‌ణ‌..పోరాటం.. మ‌నుగ‌డ‌` అనే థీమ్ లైన్ లో చిత్ర క‌థ దాగి ఉంది. దానికి సంబంధించిన ఇంటెన్స్ పోస్ట‌ర్ ని కూడా లాంచ్ చేసారు. మ‌నుషులు ఉన్నంత వ‌ర‌కూ పోరాటం..మ‌నుగ‌డ త‌ప్ప‌దు...ఇది ఇలాగే కొన‌సాగుతుంది అంటూ నివిన్ సినిమాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. పోస్ట‌ర్ లో నివిన్ పాత్ర పూర్తి యాక్ష‌న్ మోడ్ తో క‌నిపిస్తోంది. ఒళ్లంతా బుర‌ద‌.. గుబురుగా పెరిగిన గెడ్డం.. జుట్టుతో పోస్ట‌ర్ ఆద్యంతం క్యూరియాసిటీని పెంచింది.

ఇందులో మంజు వారియ‌ర్..అదితి బాలన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది థియేట‌ర్లో రిలీజ్ చేయ‌నున్నారు. అలాగే నివిన్ పాళీ న‌టిస్తోన్న మ‌రో చిత్రం `క‌న‌కం కామిని క‌ల‌హం`. ఈ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి రాజీవ్ ర‌వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

మ‌మ్ముట్టి- మోహ‌న్ లాల్- పృథ్వీరాజ్ సుకుమార‌న్- బిజుమీన‌న్- ఫ‌హ‌ద్ ఫాజిల్ త‌ర‌హాలోనే యువ‌హీరో నివిన్ పాళి తెలుగులో ఫేమ‌స్ అవుతాడేమో చూడాలి.
Tags:    

Similar News