టాలీవుడ్ లో సంక్రాంతి రిలీజ్ ల కారణంగా సరికొత్త సమీకరణాలు, కొత్త ఎత్తుగడలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో సరికొత్త రగడకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న `వాల్తేరు వీరయ్య`, `వీర సింహారెడ్డి` సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల థియేటర్ల విషయంలోనే అసలు రగడ మొదలైంది. తెలుగు సినిమాలని పక్కన పెట్టి దిల్ రాజు డబ్బింగ్ సినిమా `వారసుడు`కు భారీ స్థాయిలో థియేటర్లను బ్లాక్ చేశాడంటూ వివాదం మొదలైన విషయం తెలిసిందే.
దీని ముందు నుంచే నైజాం డిస్ట్రిబ్యూషన్ విషయంలో మైత్రీ వారికి, నిర్మాత దిల్ రాజుకు మధ్య వివాదం తలెత్తడం.. మేము కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలు పెడతామని నిర్మాతలు ప్రకటించడమే కాకుండా రీసెంట్ గా నైజాంలో మైత్రీ వారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ శశిని భాగస్వామి చేయడమే ఇప్పడు వివాదానికి ప్రధాన కారణంగా మారుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న దిల్ రాజు, ఏషియన్ వారు ఎగ్జిబిటర్లతో మైత్రీ వారికి చెక్ పెట్టాలనే ప్లాన్ ని రెడీ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో మైత్రీ వారు నిర్మించిన `సర్కారు వారి పాట`, `పుష్ప` సినిమాలు థియేటర్లో వుండగానే ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం మైత్రీ వారు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ అంశాన్ని సాకుగా చూపిస్తూ ఎగ్జిబిటర్లని ఏషియన్ వారు రంగంలోకి దించబోతున్నారని ఇన్ సైడ్ టాక్.
ఈ మొత్తం తతంగం వెనక దిల్ రాజు సోదరుడు శిరీష్, ఏషియన్ సునీల్ వున్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుత రగడకు ప్రధాన కారణం మైత్రీ వారు నైజాం డిస్ట్రిబ్యూషరన్ లోకి సీడెడ్ కు చెందిన శశిని తీసుకురావడమేనని ఇండస్ఠ్రీవర్గాల్లో వినిపిస్తోంది. సంక్రాంతికి భారీ సినిమాల రిలీజ్ లు వున్న వేళ ఇలాంటి పంచాయితీ ఏంటని?.. ఫైనల్ గా ఈ రగడతో ఎలాంటి వివాదానికి తెరలేపబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.