మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని సిద్ధమయ్యారు. ఆచార్య డిజాస్టర్ అనంతరం ఈ సినిమా ఆయనకు చాలా ముఖ్యం కానుంది. భవిష్యత్తు సినిమాలకు కూడా గాడ్ ఫాదర్ ఏదో ఒక విధంగా నమ్మకం క్రియేట్ చేయాలి అంటే తప్పకుండా గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాల్సిందే.
అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఏ నమ్మకంతో గాడ్ ఫాదర్ సినిమాను హిందీలో విడుదల చేయాలని అనుకున్నారో ఏమోగానీ అసలు ఆయన అనుకున్నట్లు ఇప్పుడు బాలీవుడ్లో పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. అందులోనూ బాలీవుడ్లో 400 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న సల్మాన్ ఖాన్ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ జనాలు పెద్దగా పట్టించుకోకపోవడం విశేషం.
ఇప్పటికే హైదరాబాదులో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. కానీ హిందీలో మాత్రం ఇంకా హడావిడి కొంచెం కూడా కనిపించడం లేదు. అసలు ఇటీవల హిందీలో విడుదలైన ట్రైలర్ 24 గంటల తర్వాత కానీ రెండు మిలియన్ల వ్యూవ్స్ అందుకోలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి హిందీ మార్కెట్లో కొన్ని ప్రయత్నాలు చేసే దెబ్బ తిన్నారు. ముఖ్యంగా సైరా సినిమాను బాగానే ప్రమోట్ చేసినప్పటికీ కూడా అక్కడ కనీసం థియేటర్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు.
ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాను సల్మాన్ ఖాన్ ఉన్నాడు అని నమ్మకంతో హిందీలో విడుదల చేస్తున్నారు. కానీ కొంచెం కూడా హైప్ క్రియేట్ కాలేదు. ఇక సల్మాన్ ఖాన్ కూడా కేవలం ఏదో ప్రెస్ మీట్ పెట్టి హిందీ ట్రైలర్ లాంచ్ చేశారు. కానీ సోషల్ మీడియాలో కూడా ఆయన ట్రైలర్ ను కనీసం పోస్టు కూడా చేయలేదు. ఇక ట్రైలర్ లో అయితే సల్మాన్ ఖాన్ కు సంబంధించిన సన్నివేశాలు హై వోల్టేజ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయబోతున్నట్లు ఆడియన్స్ లో ఒక నమ్మకం అయితే వచ్చింది. కానీ అది కేవలం తెలుగు వరకే బజ్ క్రియేట్ చేసింది. హిందీలో మాత్రం ఇంకా కనెక్ట్ కాలేదు. మరి థియేటర్లో ఏదైనా మ్యాజిక్ క్రియేట్ అయితే బాలీవుడ్ జనాలు గాడ్ ఫాదర్ ను పట్టించుకుంటారో లేదో చూడాలి.