భారీ సినిమాల కేరాఫ్ అడ్రెస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో రూపొందుతున్న సీతకు సంబంధించి కీలకమైన అప్ డేట్ ఇంకా రావడం లేదు. ఏప్రిల్ 25 విడుదలని మొన్న దాకా అన్నారు కాని దాని సూచనలు వాస్తవంలో కనిపించడం లేదు. ఇప్పటిదాకా కేవలం ఒక్క ఐటెం సాంగ్ మాత్రం రిలీజ్ చేసారు. ట్రైలర్ ఊసు లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. షూటింగ్ పూర్తయ్యిందో లేదో అధికారికంగా ప్రకటించలేదు. నిన్న వారం దాకా బాలన్స్ వర్క్ జరుగుతున్న మాట వాస్తవం.
ఈ లెక్కన ఏప్రిల్ 25న సీత రావడం అనుమానమే. పైగా ఆ మరుసటి రోజే అవెంజర్స్ ఎండ్ గేమ్ కనివిని ఎరుగని స్థాయిలో రిలీజవుతుండటంతో సీతకు అది థ్రెట్ గా మారుతుందేమోనన్న అనుమానాలు లేకపోలేదు. అదేమీ అడ్డంకి కాదు అనుకుంటే సీత అర్జెంటుగా ఫీల్డ్ లో దిగి ఏదో ఒక హంగామా చేయాలి
సరే 25 కుదరని పని అనుకుంటే మే 1 షిఫ్ట్ చేయాలి. అదే రోజు ఇప్పటికే నిఖిల్ అర్జున్ సురవరం షెడ్యూల్ చేసి పెట్టారు. పోటీ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ధైర్యం చేయొచ్చు. కాని ఇంకో వారం దాటగానే మహర్షి దాడి చేస్తాడు. థియేటర్లు మొత్తం ఆక్రమిస్తాడు. కేవలం 8 రోజుల వ్యవధితో సీత చాలా చోట్ల తీసే పరిస్థితి రావొచ్చు.
ఇంత రిస్క్ ఎందుకు అనుకుంటే మే మూడు లేదా నాలుగో వారానికి వెళ్ళాలి. అలా అనుకున్నా వారానికి ఒకటి ఎబిసిడి-డియర్ కామ్రేడ్ ఇలా క్యు పెద్దదే ఉంది. సో సీత అన్నిరకాలుగా చక్రవ్యూహంలో ఉంది. దర్శకుడు తేజనో హీరో సాయి శ్రీనివాసో దీని గురించి క్లారిటీ ఇస్తే బెటర్. నేనే రాజు నేనే మంత్రి తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకుని తేజ చేసిన ఈ మూవీ మీద టీజర్ వచ్చాక అంచనాలు పెరిగాయి