కలెక్షన్లు లేవు బాబోయ్

Update: 2016-03-10 09:30 GMT
ఫిబ్రవరి - మార్చి నెలల్లో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎందుకంత వెనకడుగు వేస్తారో.. ఈ టైంలో థియేటర్లకు వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఫిబ్రవరిలో అయినా పరిస్థితి కొంచెం బెటరే కానీ.. విద్యార్థులంతా పరీక్షల కోసం ప్రిపేరయ్యే మార్చి నెలకు వచ్చేసరికి పరిస్థితి దారుణంగా ఉంది. వీకెండ్ వరకు కాస్తో కూస్తో పర్లేదు. ఉద్యోగాలు చేసేవాళ్లు, పనుల్లో ఉండేవాళ్లు వారాంతపు సెలవుల్లో సినిమాల వైపు చూస్తున్నారు. మామూలుగా వీకెండ్ అయ్యాక సినిమాల్ని పోషించే స్టూడెంట్స్ ఈ సీజన్లో థియేటర్లకు రాకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. గత వారం మూడు కొత్త సినిమాలు వచ్చినా సరే.. వాటికి కూడా కలెక్షన్లు లేవు.

గత వారం వచ్చిన సినిమాల్లో ‘కళ్యాణ వైభోగమే’ చాలా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఆ సినిమాకు సైతం సరైన కలెక్షన్లు లేవు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమా ఆడుతున్న సుదర్శన్ థియేటర్ ఫుల్ అయితే రూ.91 వేలకు పైగా ఆదాయం వస్తుంది. కానీ ‘కళ్యాణ వైభోగమే’ మార్నింగ్ షోకు రూ.10 వేల చిల్లర మాత్రమే వసూలు చేసింది. తర్వాతి మూడు షోలకు వరుసగా రూ.20 వేలు, రూ.25 వేలు, రూ.25 వేలకు కాస్త అటు ఇటుగా వసూళ్లు వచ్చాయి. ఇక డివైడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు టాకీస్ - శౌర్య సినిమాల సంగతి చెప్పాల్సిన పని లేదు. దేవి థియేటర్లో శౌర్య మూవీకి వరుసగా రూ.9 వేలు, రూ.17 వేలు, రూ.14 వేలు, రూ.12 వేలు చొప్పున కలెక్షన్లు వచ్చాయంతే. గంటూరు టాకీస్ రూ.13 వేలు, రూ.23 వేలు, రూ.17 వేలు, రూ.14 వేలు చొప్పున రాబట్టింది. మొత్తానికి టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్లు ఉండట్లేదు. ఇంకో రెండు వారాల పాటు సినిమాలకు ఈ గడ్డు పరిస్థితి తప్పదు.
Tags:    

Similar News