జై బాలయ్య!! వినిపించలేదే?

Update: 2015-12-28 05:42 GMT
ఈ మధ్య జరిగిన భారీ సినిమా ఫంక్షన్లలో.. నాన్నకు ప్రేమతో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పచ్చు. రీసెంట్ ఫంక్షన్స్ లో ఇతర హీరోల జపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ జపం చేసి, గెస్టులను మెగా ఫ్యాన్స్ బాగానే ఇబ్బంది పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఫంక్షన్ లోనూ.. ఇలాంటి రభస తప్పదనే అనుకున్నారు అందరూ. ఎందుకంటే.. మెగా ఫ్యాన్స్ కు మించి జై బాలయ్య జైజై బాలయ్య నినాదాలు చేయడం.. నందమూరి అభిమానులకు అలవాటు. అయితే.. ఇవేవీ నాన్నకు ప్రేమతో పాటల వేడుకలో వినిపించలేదు. అలాగని.. బాలకృష్ణ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని రానివ్వలేదని అనుకోకూడదు. ఇక్కడ బాలయ్య స్లోగన్స్ వినిపించకపోవడానికి ప్రధాన కారణం.. ఎమోషన్ అని చెప్పాలి. సాధారణంగా అరుపులు - కేరింతలు - ఫ్యాన్స్ కి ఉత్సాహం ఇచ్చే కబుర్లతో వేడుకలు జరుగుతుంటాయి. కానీ నాన్నకు ప్రేమతో సెట్స్ పై ఉండగానే.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి కాలం చేయడంతో.. ఈ మూవీ ఆల్బంని ఆయనకు అంకితం చేశారు. దీంతో.. సీడీ ఆవిష్కరణ పూర్తి కాగానే, మొదట అందరూ దేవిశ్రీకి తమ సానుభూతి తెలిపి, తమ తమ తండ్రిని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు.

హరికృష్ణ - సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ - కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్.. ఇలా అందరూ తమ తండ్రులను గుర్తు చేసుకుంటూ అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ ఎఫెక్ట్ తో.. ఆడిటోరియం అంతా ఎమోషనల్ గా మారిపోయింది. ఒకోచోట కంటతడి పెట్టించే మాటలు అతిథుల నోటి వెంట వచ్చాయి. ఈ ప్రభావంతో.. ఎక్కడా ఇతర హీరోలు - స్టార్లను తలుచుకునే అవకాశం రాలేదు. అలా స్లోగన్స్ ని.. ఎమోషన్స్ డామినేట్ చేసేశాయన్న మాట.
Tags:    

Similar News