ఎంతగా అందాల ఆరబోసినా ఆఫర్లు అంతంత మాత్రమే

Update: 2022-02-02 10:30 GMT
సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో మాళవిక మోహన్‌ అందాల వింధు పీక్స్ కు చేరింది. రెగ్యులర్ గా స్కిన్‌ షో తో ఫొటోలను షేర్ చేస్తూ ఉండే మాళవిక మోహన్ ఈమద్య కాలంలో మరో అడుగు ముందుకు వేసినట్లుగా బికినీ షో చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన బికినీ ఫొటో షూట్స్ నెట్టింట ఆమె గురించి చర్చ జరిగేలా చేసింది. ఆమె షేర్‌ చేసే ప్రతి హాట్‌ ఫొటో షూట్‌ కూడా ఆమె గురించి చర్చ జరిగేలా చేస్తుంది కాని సినిమాల్లో ఆఫర్లు మాత్రం పెద్ద ఎత్తున దక్కేలా చేయడం లేదు.

అందాల వింధు విషయంలో టాప్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఉన్న ఈ అమ్మడు అవకాశాల విషయంలో కొత్త హీరోయిన్స్ మాదిరిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి.

తమిళ సూపర్‌ స్టార్స్ అయిన రజినీకాంత్‌.. విజయ్‌ వంటి స్టార్స్‌ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం పెద్ద ఎత్తున రావడం లేదు. తెలుగు తో పాటు ఇతర భాషల్లో ఈమెకు అడపా దడపా అవకాశాలు వచ్చినా కూడా అవి సీనియర్ హీరోలకు జోడీగా ప్రాముఖ్యత లేని పాత్రలే అవుతున్నాయి. తాజాగా ఒక తెలుగు సీనియర్ స్టార్ హీరోకు జోడీగా నటించే అవకాశం ఈమెకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా వల్ల టాలీవుడ్‌ లో మాళవిక మోహన్ కు గొప్ప ఎంట్రీ అయితే దక్కే అవకాశం ఉంది కాని ముందు ముందు యంగ్ స్టార్‌ హీరోలకు జోడీగా మాత్రం అవకాశాలు తక్కువ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర భాషల్లో కూడా ఈమె కెరీర్‌ అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ స్టా గ్రామ్‌ ఓపెన్ చేస్తే చాలు.. ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ చూసినా కూడా ఈమె హాట్ ఫొటోలు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం ఆ స్థాయిలో రాకపోవడం దురదృష్టకరం అంటూ ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే స్థాయిలో అందాల ప్రదర్శణ చేస్తూ.. బికినీ ఫొటోలతో ప్రేక్షకులను మరియు ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిలో పడాలంటూ కొందరు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా తప్పకుండా నీకు మంచి ఆఫర్లు వస్తాయంటూ కొందరు ఆమెకు సూచిస్తున్నారు. ఎన్నాళ్ల పాటు అందాల వింధు చేస్తూ కెరీర్‌ ను నెట్టుకు రావడం.. స్టార్‌ హీరోల సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు దక్కించుకుని అవకాశాలు దక్కించుకునేది ఎప్పుడు అన్నట్లుగా ఆమె బాధపడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Tags:    

Similar News