#RRR టీమ్.. అలా ఉస్సుర‌నిపించారు

Update: 2020-01-01 06:23 GMT
కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా #RRR టీమ్ నుంచి గుడ్ న్యూస్ అంటూ బోలెడంత ప్ర‌చార‌మైంది. అభిమానుల‌కు బిగ్ ట్రీట్ ఇస్తున్న‌ట్లు నిన్న‌టి రోజున ఆర్.ఆర్.ఆర్ టీమ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. RRR రిలీజ్ అయ్యే లోపు ప్ర‌తి పండుగ‌ కు ఓ స్పెష‌ల్ ఉంటుంద‌ని గ‌ర్వంగా ప్ర‌క‌టించారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. జ‌న‌వ‌రి ఒక‌టి మొద‌లు ఇక ప్ర‌తిరోజూ పండ‌గే అనుకున్నారు. 2020 మెగా-నంద‌మూరి అభిమానుల‌కు బెస్ట్ ట్రీట్ ఇయ‌ర్‌ గా నిలుస్తుంద‌ని భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల్ల‌ కిందుకు చేస్తూ జ‌క్క‌న్న పెద్ద షాక్ ఇచ్చాడు. కొత్త పోస్ట‌ర్ అని చెప్పి పాత పోస్ట‌ర్ కే హ్యాపీ #RRR ఇయ‌ర్ 2020 అంటూ ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసి కొత్త ఏడాది ఆరంభ‌మే ఊస్సుర‌నిపించారు.

నిన్న‌టి అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి అభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తుంటే ఊహించ‌ని షాకిచ్చారు. దీంతో అభిమాను ల్లో తీవ్ర‌ అసంతృప్తి నెల‌కొంది. ఇదేనా ఆర్.ఆర్.ఆర్ కొత్త పోస్ట‌ర్ అంటూ అసంతృప్తిని వెల్ల‌గ‌క్కుతూ చెర్రీ-తార‌క్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు గుప్పిస్తున్నారు. భోగి..సంక్రాంతి..మ‌నుక‌.. ఉగాది కూడా ఇలాగే ప్లాన్ చేసారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. సినిమాలో స్టిల్ రిలీజ్ చేయ‌డానికి ఎందుకంత నొప్పి! అంటూ నేరుగా అభిమానులే విమ‌ర్శిస్తున్నారు. టెక్నాల‌జీ అప్ డేట్ అయినా! కొంత మంది మేక‌ర్స్ మాత్రం అప్ డేట్ కాలేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

సినిమా రిలీజ్ కు ముందు వంద‌ల‌కొద్ది స్టిల్స్ రిలీజ్ చేస్తారు? అప్పుడేం ప్ర‌యోజ‌నం! అంతా రిలీజ్ వేరే ఉత్కంఠ‌లో ఉంటారు. ఆ స‌మ‌యంలో ఏం ఉప‌యోగం.. వాటిని ఎవ‌రు ప‌ట్టించుకుంటారు? అంటూ యూనిట్ ని ఉద్దేశించి ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ కామెంట్స్ పై జ‌క్క‌న్న రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ద‌శ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 70 శాతం చిత్రీర‌ణ పూర్త‌యింది.


Tags:    

Similar News