టాలీవుడ్ స్టార్స్ అంతా యాక్షన్నే నమ్ముకున్నారా? కంటెంట్ ఎలా ఉన్నా కామన్ గా యాక్షన్ ని సేఫ్ జోన్ గా భావిస్తున్నారా? సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకూ ఇదే స్ర్టాటజీ అనుసరిస్తున్నారా? త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు ఇలాగే ఉండబోతున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది.
చిరంజీవి...బాలకృష్ణ..నాగార్జున..రవితేజ.. మహేష్ ..ప్రభాస్..ఎన్టీఆర్..నాని లైనప్ అలాగే కనిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్...వాల్తేరు వీరయ్య..భోళా శంకర్ తెరకెక్కెతన్న సంగతి తెలిసిందే. ఈ మూడు చిత్రాల్లో కామన్ గా యాక్షన్ కనిపిస్తుంది. చిరంజీవి అంటే ఆ మాత్రం యాక్షన్ తప్పదు. కానీ ఈ మూడు సినిమాల్లో మోతాదుకి మించి యాక్షన్ ఉంటుందని సమాచారం.
పాయింట్ ఏదైనా కమర్శియల్ టచ్ అప్ కోసం భారీ యాక్షన్ ఉంటుందని అంచనాలున్నాయి. ఇక నటసింహ బాలకృష్ణ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ లేకుండా బాలయ్య ఉండరు. బాలయ్య లేకపోతే యాక్షన్ ఉండదు. యాక్షన్ తో బాలయ్యది అవినాభవ సంబంధం. నటసింహ ఏ సినిమా చేసినా అందులో యాక్షన్ పీక్స్ లోనే ఉంటుంది.
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 107వ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేసారు. అలాగే కింగ్ నాగార్జున హీరోగా నటిస్తోన్న 'ది ఘోస్ట్' లో నూ యాక్షన్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఆ విషయం అర్ధమవుతుంది.
ఏకంగా కత్తి పట్టి మరీ తెగ నరికే సన్నివేశాలున్నాయి. కింగ్ రోల్ ని ఆద్యంతం యాక్షన్ స్టార్ గా హైలైట్ చేస్తున్నారు ప్రవీణ్. ఇక పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ 'సలార్' లో భారీ యాక్షన్ తధ్యమని తెలిసిందే. 'ప్రాజెక్ట్-కె'...స్పిరిట్ చిత్రాల్లోనూ డార్లింగ్ యాక్షన్ పైనే ఫోకస్ పెట్టినట్లు లీకులందుతున్నాయి. అలాగే మహేష్ ని సైతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎస్ ఎస్ ఎంబీ 28 లో ఆద్యంతం యాక్షన్ స్టార్ గానే హైలైట్ చేస్తున్నట్లు సమాచారం.
మహేష్ ని సరికొత్తగా చూపిస్తూనే యాక్షన్ ఎపిసోడ్లకు పెద్ద పీట వేసినట్లు గుసగుస వినిపిస్తుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సాలిడ్ యాక్షన్ హిట్ అందుకోవాలని కొరటాల వెయిట్ చేస్తున్నారు. ఇది పక్కా కమర్శియల్ స్ర్కిప్ట్. కొరటాల మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని సమాచారం. తారక్ రోల్ ని కొత్తగా హైలైట్ చేస్తూనే యాక్షన్ కి సైతం పెద్ద పీట వేస్తున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.