కేజీఎఫ్‌ హీరో సినిమాను పట్టించుకునే వారే లేరు

Update: 2021-03-03 05:30 GMT
కన్నడ హీరో యశ్‌ కేజీఎఫ్‌ తో దేశ వ్యాప్తంగా ప్రేక్షకాధరణ దక్కించుకున్నాడు. త్వరలో కేజీఎఫ్‌ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలో ఆయన పాత సినిమాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. యశ్‌ గతంలో నటించిన సినిమా లను డబ్‌ చేసి పలు భాషల్లో ఆన్ లైన్ ద్వారా విడుదల చేస్తున్నారు. కాని ఆయన నటించిన కన్నడ మూవీ గజకేసరి ని మాత్రం తెలుగు లో డబ్‌ చేసి థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈనెల 5వ తారీకున గజకేసరి సినిమా తెలుగు వర్షన్‌ విడుదలకు సిద్దంగా ఉంది. పబ్లిసిటీ బాగానే చేస్తున్న తెలుగు సినీ జనాలు మరియు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

గజకేసరి సినిమా ను యశ్‌ కు ఉన్న బ్రాండ్‌ ఇమేజ్ తో పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావించిన మేకర్స్ కు పెద్ద షాక్‌ తగిలినట్లయ్యింది. అసలు గజ కేసరి సినిమా కు జనాలు వచ్చేనా అనే అనుమానం వ్యక్తం అవుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కూడా కేజీఎఫ్‌ హీరో యశ్‌ సినిమా అంటా అంటూ చర్చించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా రిస్క్‌ చేసి సినిమా ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. గజకేసరి సినిమా ను థియేటర్లలో చూసేందుకు ఎంత మంది ఆసక్తి చూపిస్తారంటే అనుమానమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్‌ పేరును ఇంకాస్త వాడితే బాగుండేదేమో.
Tags:    

Similar News