పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ తో బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. హిందీ వెర్షన్ ను ఏకంగా 800 థియేటర్లలో రిలీజ్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు సర్దార్. ఈ నెల 8న విడుదల కానున్న ఈ మూవీ హిందీ వెర్షన్ రిలీజ్ పై.. ఇప్పటివరకూ కొన్ని అనుమానాలు ఉన్నాయి. దీనికి కారణం అర్బాజ్ ఖాన్ ఇచ్చిన లీగల్ నోటీస్.
హిందీ దబాంగ్ మూవీకి రైట్స్ తీసుకుని పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీని చేసిన విషయం తెలిసిందే. అయితే.. అక్కడ దబాంగ్ 2 కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో మాత్రం పవన్.. దబాంగ్ 2ను తీసుకోలేదు. గబ్బర్ సింగ్ లో పోలీస్ పాత్రను మాత్రమే తీసుకుని.. తనే సొంతం గా స్టోరీ - స్క్రీన్ ప్లే రాసుకున్నాడు పవన్. అయితే.. దబాంగ్2 ని పోలిన సినిమా ఇది అంటూ అర్బాజ్ ఖాన్ లీగల్ నోటీసిచ్చాడు.
దీనిపై స్క్రీనింగ్ కమిటీ ప్రత్యేకంగా రెండు సినిమాలను తిలకించింది. అర్బాజ్ ఖాన్ నిర్మాతగా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్2కి... పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ కు ఏ విషయంలోనూ పోలిక లేదని.. అదీ ఇదీ వేరు వేరు సినిమాలను తేల్చేసింది. దీంతో హిందీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలకు లైన్ క్లియర్ అయింది.