యన్.టి.ఆర్ రెండో ట్రైలర్ లేదు

Update: 2018-12-22 10:25 GMT
నందమూరి అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘యన్.టి.ఆర్’. ఈ చిత్ర ట్రైలర్ శుక్రవారమే విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా పై ఉన్న అంచనాల్ని పెంచేలాగే సాగింది ట్రైలర్. సినీ రంగంలో ఎన్టీఆర్ ఎదుగుదల గురించి అందరికీ తెలుసు. అలాగే రాజకీయ రంగంలో ఉత్థాన పతనాల గురించీ తెలుసు.

ఐతే ఈ చిత్రం ఎన్టీఆర్ జీవితంలోని ఒడుదొడుకుల్ని ఉన్నదున్నట్లుగా చూపిస్తారా లేదా అన్నది జనాలకు సందేహంగానే ఉంది. ఈ సందేహాల్ని అంతగా నివృత్తి చేయకపోయినప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి చూస్తే ట్రైలర్లో ఒక గ్రాండియర్.. ఒక కళాత్మక దృష్టి కనిపించాయి. క్రిష్ చేతుల్లో ఈ ప్రాజెక్టును పెట్టి బాలయ్య మంచి నిర్ణయమే తీసుకున్నాడన్న భావన ట్రైలర్ కలిగించింది.

ఈ ట్రైలర్ నిడివి ఏకంగా 3 నిమిషాల 16 సెకన్లుండటం విశేషం. ఇప్పటిదాకా తెలుగు లో ఏ ట్రైలర్ కూడా ఇంత నిడివితో లేదు. మామూలుగా బాలీవుడ్ వాళ్లే మూడు నిమిషాల ట్రైలర్లు వదులుతుంటారు. తెలుగులో మాత్రం బహుశా ఇంత నిడివితో ట్రైలర్ రావడంతో ఇదే తొలిసారి కావచ్చేమో. ట్రైలర్ ఇంత పెద్దదిగా వదలడానికి కారణం లేకపోలేదు. ఇది కేవలం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ ట్రైలర్ మాత్రమే కాదు. ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ ట్రైలర్ కూడా ఇందులోనే మిక్సయింది. ఒక రకంగా చెప్పాలంటే రెండు ట్రైలర్లను కలిపి ఒకటిగా చేశారు. అందుకే చివర్లో రెండు సినిమాల టైటిళ్లను ఒకదాని తర్వాత ఒకటి వేసి.. వాటి రిలీజ్ డేట్లు కూడా ప్రకటించారు.

దీన్ని బట్టి చూస్తే ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ కోసం ప్రత్యేకంగా ఇంకో ట్రైలర్ వదిలే అవకాశం లేనట్లే. కాకపోతే దాని రిలీజ్ టైంలో ఏదైనా స్నీక్ పీక్ వదులుదాంలే అన్న ఆలోచనలో ఉన్నారట.
Tags:    

Similar News