పేరు వేశారు, కాని పేరు ప్రస్థావించలేదు

Update: 2018-12-20 01:30 GMT
బాలీవుడ్‌ మోస్ట్‌ వెయిటింగ్‌ మూవీ ‘మణికర్ణిక’ అందరూ ఊహించినట్లుగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. మణికర్ణిక పాత్ర లో ఈ చిత్రం లో కంగనా రనౌత్‌ నటించిన విషయం తెల్సిందే. తాజాగా ముంబయిలో ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి క్రిష్‌ మొదట దర్శకత్వం వహించాడు. షూటింగ్‌ దాదాపుగా ముగిసిందనుకుంటున్న సమయంలో ఆ మూవీ నుండి క్రిష్‌ బయటకు వచ్చాడు. కొన్ని సీన్స్‌ విషయం లో కంగనా కు మరియు క్రిష్‌ కు మద్య విభేదాలు వచ్చాయని, అందుకే సినిమా నుండి క్రిష్‌ తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.

టీజర్‌ మరియు ట్రైలర్‌ లో దర్శకుడిగా క్రిష్‌ పేరు ఉండటంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆయనకు గౌరవం ఇస్తున్నారని, సినిమా విషయం లో ఆయన కు క్రెడిట్‌ దక్కనుందని అంతా భావించారు. కాని తాజాగా జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నిర్మాతలు కాని, హీరోయిన్‌ కాని, ఇతరులు ఎవ్వరు కాని క్రిష్‌ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సినిమాకు దర్శకురాలు కంగనానే అన్నట్లుగా అంతా మాట్లాడారు. కంగనా అద్బుతంగా సినిమాను చేసిందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రశంసలు కురిపించారు.

టైటిల్‌ కార్డ్‌ లో క్రిష్‌ పేరు వేస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా, బహిరంగంగా మాత్రం ఆయన పేరును ప్రస్థావించేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. టైటిల్‌ కార్ట్‌ లో క్రిష్‌ పేరు లేకుంటే లీగల్‌ సమస్యలు ఏమైనా ఎదురయ్యే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో వారు టైటిల్‌ కార్డు వరకు క్రిష్‌ ను పరిమితం చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ మూవీ విడుదలకు సిద్దం అవుతున్న నేపథ్యం లో క్రిష్‌ అసలు ‘మణికర్ణిక’ గురించి ఆలోచిస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. కాని క్రిష్‌ ఫ్యాన్స్‌ మాత్రం ‘మణికర్ణిక’ విషయం లో క్రిష్‌ కు అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News