టాప్ 10లో ఒక్క తెలుగు సినిమా లేదే

Update: 2019-02-19 05:01 GMT
చదువరులు ఇచ్చే రేటింగ్స్ అభిప్రాయాల ప్రకారం ర్యాంకులు ఇచ్చే సుప్రసిద్ధ మూవీ డేటా బేస్ వెబ్ సైట్ ఐఎండిబి టాప్ 10 ఇండియన్ మూవీస్ లిస్ట్ లో ఒక్క తెలుగు సినిమా లేకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారతీయ సినిమా సత్తా చాటిన బాహుబలి 2 విచిత్రంగా 16వ స్థానంలో ఉండగా అధిక శాతం తమిళ్ హిందీవే ఉండటం గమనార్హం. ఈ లిస్ట్ లో పేర్లు రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి కానీ మహా అయితే ఓ ర్యాంకు తగ్గడం పెరగడం జరుగుతుందే తప్ప మరీ అనూహ్యమైన మార్పులు ఏమి ఉండవు. గొప్ప క్లాసిక్స్ మాస్టర్ పీసెస్ అనదగ్గ తెలుగు సినిమాలు దేనికీ చోటు దక్కకపోవడం చూసి ఐఎండిబి విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఒక్కసారి టాప్ 10 లిస్ట్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది

1. ఆనంద్ హిందీ

2. దృశ్యం మలయాళం

3. యుఆర్ఐ సర్జికల్ స్ట్రైక్

4. నాయకన్

5. ఆన్బే శివం

6. గోల్ మాల్

7. విక్రమ్ వేదా

8. అందా దున్

9. బ్లాక్ ఫ్రైడే

10. రట్ససన్

చూసారుగా ఇందులో కొన్ని ఆల్రెడీ మనకు డబ్బింగ్ రూపంలో వచ్చాయి కానీ వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీ లేకపోవడం అంటే వింతే. ఐఎండిబి ఈ రేటింగ్స్ ఇవ్వడానికి చాలా అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది. అయినప్పటికీ బాహుబలి ఇందులో కాకుండా టాప్ 20లో ఉండటం అంటేనే అసలైన షాక్. తమిళ్ సినిమాలు సగానికి పైగా స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. లిస్ట్ లో చివరి స్థానం కొట్టేసిన రట్ససన్ బెల్లంకొండ సురేష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గా విజయం సాధించని అన్బే శివమ్ సైతం ప్లేస్ కొట్టేయడం గమనార్హం. ఏంటో తెలుగు సినిమాలు ఎప్పుడు టాప్ లోకి వస్తాయి చూడాలి.
Tags:    

Similar News