కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లేమీ కావు.. 'మంచి సినిమా కదా' అనిపిస్తాయి.. ఆ సినిమాకు పనిచేసిన వారందరికీ మంచి పేరు తీసుకొస్తాయి. కానీ స్లో గా వాటికి క్లాసిక్ స్టేటస్ వచ్చేస్తుంది. అలాంటివాటిలో అక్కినేని నాగార్జున 'మన్మధుడు' ఒకటి. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే చాలామంది ప్రేక్షకులు ఆ ఛానల్ మార్చరు.. అంతలా మెప్పించింది ఆ సినిమా. మరి ఆ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ అనగానే.. సినిమాను అధికారికంగా ప్రకటించదానికి ముందే ఒక క్రేజీ ప్రాజెక్టుగా మారిపోయింది.
'చిలసౌ' తో దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్న హీరో రాహుల్ రవీంద్రన్ 'మన్మధుడు' సీక్వెల్ ను తెరకెక్కిస్తాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. త్వరలో ఈ సినిమా అధికారిక ప్రకటన రానుంది. దీంతో ఈ సీక్వెల్ పై సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. 'మన్మధుడు' మ్యాజిక్ ను రాహుల్ రవీంద్రన్ రిపీట్ చేయగలడా అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. 'మన్మధుడు' సినిమాకు చాలా అంశాలు కలిసి వచ్చాయి. నాగ్ రొమాంటిక్ ఇమేజ్.. త్రివిక్రమ్ స్టొరీ - డైలాగ్స్.. బ్రహ్మానందం సునీల్ టాప్ ఫామ్ లో ఉండడం.. దేవీ చార్ట్ బస్టర్ మ్యూజిక్.. వీటన్నిటికి తోడు విజయ్ భాస్కర్ డైరెక్షన్.
మరి 'మన్మధుడు' సీక్వెల్ విషయంలో కూడా దాదాపు ఇన్ని అంశాలు సరిగ్గా కుదిరితేనే మ్యాజిక్ రిపీట్ చేయడానికి వీలవుతుంది. సీక్వెల్ అనగానే అంచనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సినిమాలో మంచి కామెడీ ఉండాలని నాగార్జున ఇప్పటికే రాహుల్ కు సూచించాడట. అందుకోసమే లైటర్ వెయిన్ లో ఉండే కామెడీ ఎపిసోడ్స్ ను రాహుల్ రెడీ చేస్తున్నాడని అంటున్నారు. అంతా బాగుంది కానీ అప్పట్లో గురూజీ కలం నుండి జాలువారిన పంచ్ డైలాగుల స్టైల్ లో ఇప్పుడు ఈ జెనరేషన్ కు తగ్గట్టు రాయగలుగుతారా అనేది మాత్రం కాస్త అనుమానంగానే ఉంది. ఒకవేళ ఈ సినిమాను సక్సెస్ చేస్తే రాహుల్ స్టార్ డైరెక్టర్ల లీగ్ లోకి చేరడం ఖాయమే.