సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఇప్పటి దాకా వచ్చిన అన్ని బయోపిక్ లు దాదాపు సక్సెస్ అయినవే. బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ - ఎమ్మెస్ ధోని - సంజు - దంగల్ - మేరీ కామ్ - నీర్జా - సూపర్ 30 - చపక్ - భాగ్ మిల్కా భాగ్ - థాకరే లాంటి సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక మన టాలీవుడ్ విషయానికొస్తే బయోపిక్ ల శకానికి 'మహానటి' చిత్రం నాందిపలికిందని చెప్పవచ్చు. అంతకముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అలాంటి నేపథ్యంలో కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని సినిమాలు రూపొందించినప్పటికీ వాటిని బయోపిక్ లుగా ట్రీట్ చేయలేము. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2018లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత తెరపైకొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 'ఎన్టీఆర్ కధానాయకుడు' 'ఎన్టీఆర్ మహానాయకుడు' అని రెండు భాగాలుగా తెరకెక్కిన నందమూరి తారక రామారావు బయోపిక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ రెండు బయోపిక్ ల తరువాత బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరపైకి రాబోతోందంటూ గత కొంత కాలంగా వార్తలు హల్ చల్ చేసాయి.
గోపీచంద్ పాత్రలో హీరో సుధీర్ బాబు నటిస్తారని ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం స్వతహాగా బ్యాడ్మింటన్ టచ్ ఉన్న సుధీర్ బాబు కూడా సిద్దమయ్యాడు. దీని కోసం కొన్ని నెలలు ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ముంబైకి చెందిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది కూడా. అయితే ప్రాజెక్ట్ ప్రకటించి ఇంతకాలం అవుతున్నా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటికి రావడం లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ అసలు వుంటుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల తెలుగు నుంచి భారీగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయంటూ వస్తున్న వార్తల్లో ఎక్కడా ఈ బయోపిక్ గురించి మాట్లడలేదు. అయితే సైలెంట్ గా ఈ సినిమా రెడీ అవుతుందంటూ కొందరంటున్నా - సినీజనాలు మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి ఎంత హడావుడి చేస్తే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న హీరోల సినిమాలకే ప్రమోషన్స్ హోరెత్తించేలా చేస్తుంటే ఈ కామ్ గోయింగ్ స్ట్రాటజీ ఫాలో అయితే రేపొద్దున థియేటర్స్ కి ఆడియెన్స్ వచ్చే అవకాశాలు తక్కువుగా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ ప్రాజెక్ట్‌ని చేయడానికి ముందుకొచ్చిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కి , పుల్లెల గోపీచంద్ కి మధ్య ఒప్పందం ఇంకా ఓ కొలిక్కి రాలేదట - తను అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిరాకరిస్తోందని.. ఆ కారణంగానే ఈ బయోపిక్ చర్చల దశలోనే ఆగిపోయిందని తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.