లెజెండరీ నటుడు, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా తన పేరుని.. ఫోటోలు మరియు గొంతును ఉపయోగించడాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఏ వ్యక్తి గానీ లేదా సంస్ధ గానీ వాణిజ్యపరమైన కార్యక్రమాల కోసం తన సెలబ్రిటీ హోదాని వాడుకోకుండా చూడాలంటూ పిటిషన్ దాఖలు చేసారు.
అమితాబ్ బచ్చన్ పిటిషన్ ని విచారించిన ఢిల్లీ హైకోర్టు.. ఆయన వ్యక్తిగత హక్కులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. నటుడి అనుమతి లేకుండా ఏ వ్యక్తి గానీ లేదా సంస్థ గానీ ఆయన పేరు - ఫొటో లేదా వాయిస్ ని ఉపయోగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు అమితాబ్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఫ్లాగ్ చేసిన కంటెంట్ ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారులు మరియు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను కోర్టు ఆదేశించింది.
అనుమతి లేకుండా తన పేరు - ఫోటో - వాయిస్ - వ్యక్తిగత లక్షణాలను ఉపయోగించడంపై అమితాబ్ నేడు ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా వేశారు. బిగ్ బీ తరఫున ప్రముఖ సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తూ.. అనేక కారణాలతో ఈ పిటిషన్ వేయాల్సి వచ్చిందని తెలిపారు.
"కొందరు టీ-షర్టులు తయారు చేసి వాటిపై నటుడి ఫొటోను ప్రింట్ చేస్తున్నారు. మరికొందరు ఆయన పోస్టర్లను అమ్ముతున్నారు. కొందరైతే అమితాబచ్చన్. కామ్ అంటూ డొమైన్ క్రియేట్ చేసి వెబ్సైట్స్ పెడుతున్నారు. అందుకే మేం కోర్టుకు రావాల్సి వచ్చింది" అని బచ్చన్ తరఫున సాల్వే కోర్టుకు విన్నవించారు.
వాదనల అనంతరం ఈ పిటిషన్ పై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని సంస్థలు వారి ఉత్పత్తులు మరియు సేవలను ప్రచారం చేసేందుకు నటుడి అనుమతి లేకుండానే ఆయన సెలబ్రిటీ హోదాను ఉపయోగించడం ఆయనను బాధించిందని కోర్టు గుర్తించినట్లుగా జస్టిస్ నవీన్ చావ్లా తెలిపారు.
ఇలాంటి వాటిని నిషేదించకపోతే.. కొన్ని కార్యకలాపాల వల్ల సుప్రసిద్ధ వ్యక్తికి చెడ్డ పేరు రావడంతో పాటు.. ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని న్యాయస్థానం పేర్కొంది. అందుకే అమితాబ్ బచ్చన్ అనుమతి లేకుండా ఆయన పేరు - ఫోటో - వాయిస్ లను ఎవరూ ఉపయోగించకూడదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇక సినిమాల విషయానికొస్తే.. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం తెలుగులో "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్ బీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 'మనం' 'సైరా' తర్వాత అమితాబ్ కనిపించనున్న తెలుగు సినిమా ఇదే అవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.