మళ్ళీ మొదలు పెట్టిన రానా దగ్గుబాటి

Update: 2019-01-08 08:27 GMT
'బాహుబలి' విజయం తర్వాత రానా దగ్గుబాటి సినిమాలను సైన్ చేసే విషయంలో చాలా జోరు చూపిస్తున్నాడు. మల్టిపుల్ ప్రాజెక్టుల మీద పని చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. 'నేనే రాజు నేనే మంత్రి' తర్వాత రానా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో 'హాథి మేరె సాథీ' అనే సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.  బహుభాషా చిత్రం అయిన ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తయింది.  ఈ సినిమాలోని కీలకమైన ఎపిసోడ్లను థాయిల్యాండ్ లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరిపారు. కానీ ఈ సినిమా పూర్తి చేయకముందే ఎన్టీఆర్ బయోపిక్ లో నారా చంద్రబాబు నాయుడు పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో 'హాథి మేరె సాథీ' సినిమా షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ను మళ్ళీ మొదలు పెట్టారట.  కేరళలో ఈ సినిమా తాజా షెడ్యూల్ ను ఈరోజే  ప్రారంభించారని సమాచారం.  పెండింగ్ ఉన్న షూట్ అంతా పెద్దగా గ్యాప్ తీసుకోకుండా కంప్లీట్ చేసి విడుదలకు సిద్దం చేస్తారని సమాచారం.  ఒక ఏనుగుకు రానా పాత్రకు మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో జోయా హుస్సేన్.. పుల్కిత్ సామ్రాట్.. విష్ణు విశాల్.. కల్కి కొచ్లిన్ లు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు.. తమిళ.. హింది భాషలలో ఒకే సారి తెరకెక్కిస్తున్నారు.  శంతను మొయిత్రా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.  తెలుగులో ఈ సినిమా టైటిల్ 'అరణ్య' కాగా తమిళంలో 'కాదన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు.





Full View
Tags:    

Similar News