ప్రముఖ సినీ నటుడు విశాల్ మీద కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఒక కేసు విషయంలో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. కోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎదురయ్యే తలనొప్పి ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసేలా తాజా పరిణామాన్ని చెప్పొచ్చు. విశాల్ కు చెన్నైలోని వడపళనిలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పని చేస్తున్న ఉద్యోగులకు ఇచ్చే జీతాల్లో టీడీఎస్ ను మినహాయించి వారికి వేతనాలు ఇస్త్తారు. అలా ఉద్యోగుల జీతాల నుంచి తీసుకున్న టీడీఎస్ ను ఆదాయపన్ను శాఖకు తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు విశాల్ మీద ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసు ఆయనపై నమోదైంది.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని విశాల్ కు గతంలో అధికారులు నోటీసులు పంపారు. దీనికి సమాధానం ఇవ్వకపోవటంతో చర్యలు తీసుకోవాలంటూ ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు.. నేరుగా హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు పంపింది. అయితే.. విచారణకు విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. తనకు మినహాయింపు ఇవ్వాలని విశాల్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీన్ని ఐటీ శాఖ తరఫు న్యాయవాది వ్యతిరేకిస్తూ వాదనలు విన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు.. విశాల్ పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.