న్యాయస్థానాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తలనొప్పులు తెచ్చుకున్న సెలబ్రిటీలు.. ప్రముఖులు ఎందరో. అలాంటి జాబితాలో తాజాగా టీమిండియా కెప్టెన్.. ధనాధన్ ధోని కూడా చేరినట్లైంది. ఓ మేగ్ జైన్ కవర్ పేజీ పై విష్ణుమూర్తి అవతారంలో ధోనిని ప్రచురించిన వైనంపై ఒక కేసు అనంతపురం కోర్టులో నమోదైంది. దీనికి హాజరు కావాల్సిందిగా గతంలో నోటీసులు జారీ అయ్యాయి.
ఇదే అంశానికి సంబంధించి బెంగళూరు కోర్టు కూడా కేసు నడుస్తోంది. అయితే.. అనంతపురం కోర్టు పంపిన నోటీసులకు బదులుగా కోర్టు హాజరు కావటంలో ధోనీ విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో.. తాజా విచారణలో ఆయనపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను ఇష్యూ చేశారు. కొన్ని కొన్ని విషయాల్లో వెనువెంటనే స్పందించాల్సి ఉంటుంది. దీన్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అందుకు మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ధోని వ్యవహారం కూడా ఇదేనని చెప్పొచ్చు. మరి.. నాన్ బెయిల్ బుల్ చికాకు నుంచి ధోనీ ఎలా బయటపడతారో?