బాహుబలి భామకు బాగా నచ్చినవి

Update: 2017-01-12 12:57 GMT
కెనడా బ్యూటీ నోరా ఫతేహి ఇండియాలో బాగానే పాగా వేసింది. అటు బాలీవుడ్ ని ఇటు టాలీవుడ్ ని తన ఐటెం సాంగ్స్  తో ఊపేస్తోంది.  ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈమెను తెగ ఆదరించేసింది. టెంపర్ తో మొదలుపెట్టి.. బాహుబలి.. కిక్2..షేర్.. లోఫర్.. ఊపిరి.. ఇలా వరుస అవకాశాలు వచ్చేశాయి.

తనకొచ్చిన అవకాశాలను ఎంచక్కా ఉపయోగించుకుని.. ఇండియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నోరా ఫతేహికి ఫోటో షూట్స్ కొత్తేమీ కాదు. కానీ.. తన ఫోటో షూట్స్ అన్నిటిలో తనకు నచ్చినదేంటో చెప్పేసింది ఈ అమ్మడు. అంతేకాదు.. ఇప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఆ ఫోటోలను షేర్ చేసింది కూడా. టూ పీస్ బికినీని క్లీవేజ్ దగ్గర కట్ చే సి మరీ తయారు చేసిన డిజైనర్ వేర్ అదిరిపోయిందిలే. నడుం ఒంపుల నుంచి నాభి సోయగాల వరకు.. క్లీవేజ్ నుంచి కాలి సొగసుల వరకూ.. ఒక్కో పార్ట్ లోని అందాన్ని ఓ రేంజ్ లో ఎగ్జిబిట్ చేసేసింది.

'కింగ్ ఫిషర్ కేలండర్ కోసం తీసిన ఈ బయటకు రాని ఫోటోస్ నా ఫేవరేట్స్. హెయిర్ స్టైల్.. మేకప్ నాకు తెగ నచ్చేశాయ్' అంటోంది నోరా ఫతేహి. కింగ్ ఫిషర్ కేలండర్ కోసం అంటే ఆ మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి కానీ.. ఇంతలా సోయగాలను కురిపించేస్తున్న ఈ ఫోటోలను చూసి.. అభిమానులు తెగ ఉత్సాహపడిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News