#గుస‌గుస‌.. భీమ్లా కాదు బంగార్రాజు తెలివైనోడు!

Update: 2022-01-16 05:52 GMT
ముందుగా సంక్రాతి రేసులో నిలిచిన పెద్ద చిత్రాలు మూడే మూడు. అందులో పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవ్వాల్సిన `ఆర్.ఆర్.ఆర్`...`రాధేశ్యామ్`. అటుపై ఈ రెండు సినిమాల‌కు పోటీగా  తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాల‌కు సిద్ద‌మైన `భీమ్లా నాయ‌క్`. అయితే అనూహ్యంగా మూడు సినిమాలు వాయిదా ప‌డ్డాయి. మ‌రి ఇక్క‌డ  ఈ స‌న్నివేశం ఎవ‌రికి? అనుకూలం.. ఎవ‌రికి ప్ర‌తికూలం? అంటే వాయిదా వేసుకున్న‌ సినిమాల‌కు ప్ర‌తికూల‌మైన వాతావ‌ర‌ణంగా చెప్పొచ్చు.

కోవిడ్ వ‌ల్ల వాయిదా ప‌డినా కానీ.. భీమ్లా నాయ‌క్ కి మ‌రో మంచి తేదీ దొర‌క‌డం అన్న‌ది సులువు కాదు. సంక్రాంతి బ‌రిలో వెనుదిర‌గ‌కుండా వ‌చ్చేస‌న `బంగార్రాజు` ఇదే బెస్ట్ సీజ‌న్ అని నిరూపిస్తున్నాడు. ఈ మూడు సినిమాలు వాయిదా ప‌డ‌టంతో `బంగార్రాజు` జ‌న‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చాడు. మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌యినా వసూళ్ల ప‌రంగా డోఖా లేదు. సంక్రాంతికి ఉన్న పెద్ద హీరో సినిమా ఇదే కాబ‌ట్టి జ‌నం థియేట‌ర్ల‌కు వెళుతున్నారు. ఓమిక్రాన్ భ‌యాలు ఎవ‌రి క‌ళ్ల‌లోనూ క‌నిపించ‌లేదు కాబ‌ట్టి ఇక థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు జ‌నం వెన‌కాడ‌డం లేద‌ని ప్రూవ్ అవుతోంది.

పైగా విదేశాల‌ త‌ర‌హాలోనే తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కి సంబంధించి  ఎలాంటి ఆంక్ష‌లు లేవు. ఓమిక్రాన్ భ‌యం జ‌నాల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఏపీలో నైట్ క‌ర్ప్యూ సైతం వాయిదా ప‌డింది.  వీట‌న్నింటినీ `బంగార్రాజు` ఎన్ క్యాష్ చేసుకున్నాడు. ఏపీలో త‌గ్గిన టిక్కెట్ ధ‌ర‌ల సంగ‌తి ప‌క్క‌న‌బ‌డితే బంగార్రాజుకి అన్ని పాజిటివ్ గానే క‌లిసొచ్చాయి. అందుకే సినిమా మొద‌టి రోజు 17 కోట్లు వ‌సూళ్లు సాధించింది. స్టిల్ హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో ర‌న్నింగ్ లో  ఉంది.  ఆ ర‌కంగా ప్రేక్ష‌కుల‌కు నాగ‌చైత‌న్య‌...నాగార్జున ఎంట‌ర్ టైన్ మెంట్ తో ఖుషీ అయ్యేఫ‌లితం అందుకుంటున్నారు. తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ సేఫ్ అయ్యేందుకు ఆస్కారం లేక‌పోలేద‌ని తెలుస్తోంది. స‌రిగ్గా జ‌న‌వ‌రి 12న గ‌నుక `భీమ్లా నాయ‌క్` రిలీజ్ అయితే బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచేద‌ని క‌లెక్ష‌న్ల‌కు డోఖా ఉండేది కాద‌ని ఇప్పుడు మ‌రోసారి విశ్లేషిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ వ‌ల్ల భీమ్లా తీవ్రంగా న‌ష్టపోయాడ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. వాళ్లు అభ్య‌ర్థించ‌డం వ‌ల్ల‌నే భీమ్లా నాయ‌క్ ని వాయిదా వేసారు. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ ఇది ఎప్ప‌టికి త‌గ్గుతుందో అనే ఆందోళ‌న నెల‌కొంది.

`భీమ్లా నాయ‌క్` టార్గెట్ కేవ‌లం తెలుగు రాష్ట్రాలే కాబ‌ట్టి రిలీజ్ చేసి ఉంటే పెద్ద స‌క్సెస్ అయ్యేద‌ని.. సినిమా ఎలా ఉన్నా సీజ‌న్ లో న‌డిచిపోయేద‌ని టాక్ వినిపిస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏప్రిల్ వ‌ర‌కూ ఆగాల్సిందే. థ‌ర్డ్ వేవ్ ముగిసేస‌రికి మూడు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. వేవ్ ఇప్పుడే  మొద‌లైంది. ఉధృతి.. ప‌రిణామాల్ని బ‌ట్టి రిలీజ్ లు ఆధార‌ప‌డి ఉంటాయి. ఏది ఏమైనా కానీ.. భీమ్లా కాదు బంగార్రాజు తెలివైనోడు! అని ప్రూవ్ అవుతోంది.
Tags:    

Similar News