కోలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్ డెబ్యూ 'వారసుడు' ఆడియో లాంచ్ చెన్నై లో గ్రాండ్ సక్సెస్ చేసిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున అభిమానులు ఈవేడుకకు తరలి వచ్చారు. అటుపై విజయ్ పాట పాడటం..చిన్నగా స్టెప్పులు వేయడం లాంటివి అభిమానులకు డబుల్ కిక్ ని పంచాయి. కోలీవుడ్ లో విజయ్ పెద్ద స్టార్ కాబట్టి ఇదంతా సాధ్యమైంది. దీన్ని పెద్ద విశేషంగా భావించాల్సిన పనిలేదు.
చిత్ర నిర్మాత దిల్ రాజు పెద్దగా కష్టపడకుండానే అక్కడ పనైపోయింది. అయినా ఓ తెలుగు నిర్మాత సినిమా ఈవెంట్ అక్కడ పెద్ద సక్సెస్ అవ్వడం విశేషంగానే భావించాలి. మరి టాలీవుడ్ లో విజయ్ పరిస్థితి ఏంటి? అంత జనం ఇక్కడ సాధ్యమేనా? అంటే అంత వీజీ కాదు. 'వారసుడు' చిత్రం విజయ్ కి తెలుగు డెబ్యూ. గతంలో పలు అనువాద చిత్రాలతో మెప్పించినప్పటికీ సూర్య..కార్తీ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న నటుడు కాదు.
అలాగని పూర్తిగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేని వాడు అని కాదు. అతనికంటూ ప్రత్యేకమైన అభిమానులు చాలా మందే ఉన్నారు. కానీ తెలుగు డెబ్యూ కాబట్టి కోలీవుడ్ ని మించి ఇక్కడ జరిగే ప్రీ రిలీజ్ వేడుకును దిల్ రాజ్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. మరి ఆ రకంగా రాజుగారు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తారు? అన్నది చూడాలి.
ఇప్పటికే రిలీజ్ విషయమై ఇతర నిర్మాతలతో వాగ్వివాదం చోటు చేసుంకుంటోన్న సంగతి తెలిసిందే. తమిళ హీరో సినిమాకి ఇక్కడంత ప్రయర్టీ దేనికంటూ ఇతర నిర్మాతలు పట్టుబడుతున్నారు.
ఈ వేడిలో రాజుగారు 'వారసుడు' తెలుగు ఈవెంట్ ని సక్సెస్ చేయాలి. అయితే ఇదంత వీజీ కాదు. విజయ్ అనువాద చిత్రాలు తెలుగులో చాలాసార్లు రిలీజ్ అయ్యాయి.
కానీ ఆయన తెలుగు మీడియాతో ఏనాడు ఇంటరాక్ట్ అవ్వలేదు. డబ్బింగ్ చేసి రిలీజ్ చేయడం వరకే చూసారు తప్ప! తెలుగు ఆడియన్స్ కి సినిమా రీచ్ అయ్యేలా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏనాడు పాల్గొనలేదు. ఆ రకమైన నెగిటివిటీ విజయ్ పై చాలా కాలంగా ఉంది. ముందుగా ఆ ఇంపాక్ట్ ని తొలగించుకోగలగాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

#EnNenjilKudiyirukkum pic.twitter.com/4rbooR4XLa
— Vijay (@actorvijay) December 24, 2022