శర్వాతో కాలేదు.. నాగశౌర్య అయినా నిలబడతాడా?

Update: 2022-09-23 11:30 GMT
ఆగస్టు నెల తెలుగు చిత్ర పరిశ్రమకు బాగా కలిసి వచ్చింది. బింబిసార, సీతారామం సినిమాలు ఊహలకందని రేంజ్ లో మంచి ప్రాఫిట్స్ అందించాయి. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి టైం అయితే బాగా కలిసి వచ్చింది. ఇక ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ సక్సెస్ ట్రాక్ తప్పింది. తెలుగులో వచ్చిన మరో బిగ్ బడ్జెట్ మూవీ లైగర్ డిజాస్టర్ కాగా ఆ తర్వాత 'అంగరంగ వైభవంగా' మూవీ కూడా కంటెంట్ పరంగా కూడా ఫెయిల్ అయ్యింది.

ఇక ఈ నెలలో వచ్చిన సినిమాలలో 'ఒకే ఒక జీవితం' మాత్రమే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ సినిమాతో పాటు వచ్చిన మరికొన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మొదటిరోజు డిజాస్టర్ టాక్ తట్టుకోలేక రెండవ రోజు నుంచి థియేటర్లు చాలా వరకు తగ్గించారు.

ఇక ఇప్పుడు రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే ఒకే ఒక్క జీవితం పాజిటివ్ గా టాక్ తెచ్చుకున్నా కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తి స్థాయిలో అంచనాలకు తగ్గట్లుగా ప్రాఫిట్స్ అయితే అందించలేదు.

కేవలం పాజిటివ్ గా టాక్ వస్తే సరిపోదు అని అంతకుమించి అనేలా సినిమా ఉండాలి అనే ఆడియోన్స్ కోరుకుంటున్నట్లుగా ఆ సినిమాతో అర్థమైంది. అయితే బిలో యావరేజ్ టాక్ అందుకున్న 'కృష్ణ వ్రింద విహారి' సినిమా నిలదొక్కుకుంటుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణ వ్రింద విహారి సినిమాపై నాగశౌర్య అయితే చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాకు మొదటి షో నుంచి ఏదో ఒకసారి చూడవచ్చు అనేలా టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి కామెడీ తో సినిమాను బ్యాలెన్స్ చేసి తీసినట్లు కూడా చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది అని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఒకే ఒక జీవితం కు అంత మంచి టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునేందుకు చాలా కష్టమైంది. బాక్సాఫీస్ వద్ద మాత్రం పూర్తిస్థాయిలో లాభాలు అయితే అందించింది లేదు. హడావుడి కూడా పెద్దగా కనిపించలేదు. ఆ సినిమాకు ప్రమోషన్స్ ఇంకాస్త హై డోస్ లో చేసి ఉంటే బాగుండేది. ఇక ఇప్పుడు కృష్ణ వ్రింద విహారి టీమ్ అయినా వచ్చిన కాస్త పాజిటివ్ టాక్ తో అయినా హైప్ క్రియేట్ చేసి ప్రాఫిట్స్ అందుకుంటుందో లేదో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News