శుక్రవారం వచ్చేసింది. ప్రతి వారం వచ్చే శుక్రవారంతో పాటు వెండితెర మీదా.. ఓటీటీ మీదా కొత్త సినిమాలు రావటం అలవాటుగా మారింది. చాలా రోజుల తర్వాత వచ్చిన పెద్ద సినిమా బాలయ్య ‘అఖండ’ను ఒక రోజు ముందే థియేటర్లలో దించేశారు. ఈ వారం తెలుగులో విడుదలైన మూడు ముఖ్యమైన సినిమాల్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇందులో మొదటిది బాలక్రిష్ణ ‘అఖండ’ విషయానికి వస్తే.. దాదాపు రెండేళ్ల తర్వాత వెండి తెర మీద వెలిగిన బాలయ్య.. తన అఖండతో అభిమానుల్ని అలరిస్తున్నారు. 2019 డిసెంబరు 20న రూలర్ గా వచ్చినప్పటికీ.. ఆకట్టుకున్నది లేదు.
దీంతో మాంచి ఆకలి మీద ఉన్న అభిమానులతో పాటు.. తెలుగు ప్రేక్షకులకు మాస్ మూవీని తన తాజా అఖండతో చూపించారని చెప్పాలి. ఈ మూవీకి ఉన్న మరో ముఖ్యమైన అంశం.. మూవీ రన్నింగ్ టైం 2.48 గంటలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా రెండున్నర గంటల్లోపే ముగించేస్తున్నారు. జక్కన్న తాజాగా చెక్కుతున్న ట్రిపుల్ ఆర్ మూవీని సైతం భారీగా కుదించిన తర్వాత కూడా 3.06 గంటలకు లెక్క తేలిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు గంటలకు తగ్గే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. దీంతో.. అమ్మో.. మూడు గంటలా? అన్న వాదన వినిపిస్తున్న వేళ.. బాలయ్య ‘అఖండ’ మూవీ సైతం మూడు గంటలకు దగ్గరగా రావటం.. దాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేయటాన్ని రాజమౌళి పరిగణలోకి తీసుకోవాలంటున్నారు.
సినిమా బాగుండాలే కానీ.. దాన్ని ఎంజాయ్ చేయటానికే ప్రాధాన్యత ఇస్తారే కానీ.. రన్నింగ్ టైంను చూసి బెదిరిపోరన్న చర్చ నడుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ రోజు (శుక్రవారం) విడుదలవుతున్న ‘మరక్కార్’.. అరేబియా సముద్ర సింహం గా వస్తున్న మోహన్ లాల్.. అర్జున్ లు నటించిన ఈ మూవీ రన్నింగ్ టైం ఏకంగా 2.58 గంటలు. ఈ వారమే విడుదలవుతున్న మరో మూవీ ‘స్కైలాబ్’. ప్రముఖ కథానాయికి నిత్యామీనన్ ప్రధానపాత్రను పోషించటమే కాదు.. ఈ సినమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. దీనిపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రన్నింగ్ టైం 2.28 గంటలు కావటం గమనార్హం.
ఇప్పటి వరకు సినిమా పెద్దది.. చిన్నది అన్నది కాకుండా రన్నింగ్ టైం రెండుబావు గంట మించకుండా చూసుకుంటున్న దానికి భిన్నంగా ఈ వారం వచ్చిన.. వస్తున్న సినిమాలు నిడివి.. ఇప్పటివరకు ఎక్కువమంది పాటిస్తున్న రూల్ కు భిన్నంగా ఉండటం ఆసక్తికరమైన అంశం. అఖండ రన్నింగ్ టైం గురించి ప్రేక్షకుల్లో చర్చ జరగకుండా.. సినిమా గురించే చర్చ జరుగుతున్న వైనాన్నిరాజమౌళి నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. కట్టిపారేసేలా సినిమా ఉండాలే కానీ సమయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది.