‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వాస్తవానికి ఈ నెల 11న విడుదల కావాల్సిన సినిమా. ఐతే ఎనిమిదో తారీఖున 500.. 1000 నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించడంతో తర్వాతి వారానికి వాయిదా పడిపోయింది. ఐతే ఈ మధ్యలో ఎలా మార్పులు చేశారో ఏమో కానీ.. ఆశ్చర్యకరంగా ఇందులో పెద్ద నోట్ల రద్దు మీద ఫన్నీ డైలాగులు పెట్టడం విశేషం.
సినిమా ఆరంభంలోనే సత్య పాత్ర .. నేనెళ్లి వెయ్యి నోట్లు మార్చుకోవాలి అంటుంది. ఇంకో సన్నివేశంలోనూ సత్య పాత్ర నోట్ల గురించి జోక్ పేలుస్తుంది. ఇంకో సన్నివేశంలో హీరోయిన్ ఆటో దిగితే.. ఆటో డ్రైవర్ ఐదొందలు ఇవ్వకండి.. చిల్లర లేదు వంద నోట్లే ఇవ్వండి అంటాడు. దాదాపుగా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడగా.. డబ్బింగ్ లో మళ్లీ ఈ డైలాగులు చేర్చినట్లున్నారు. ఇంత వేగంగా స్పందించి.. ట్రెండీ డైలాగులు యాడ్ చేయడం విశేషమే. సినిమాలో మిగతా డైలాగులు కూడా బాగా పేలాయి. అబ్బూరి రవి తన పెన్ పవర్ చూపించాడు.
దెయ్యమైన హీరోయిన్ దయ్యం సినిమా చూస్తూ భయపడటం.. ‘‘నాకు దయ్యం సినిమాలంటే చిన్నప్పట్నుంచి చాలా భయం” అనడం బాగుంది. ఓ సన్నివేశంలో అన్నపూర్ణ శంకరాభరణం పాట పాడుతూ.. దాని గురించి గొప్పగా చెబుతుంటే.. నిఖిల్ పాత్ర.. ‘‘ఇప్పుడు శంకరాభరణం వద్దు.. అది మనకు అంతగా అచ్చిరాలేదు’’ అంటాడు. నిఖిల్ లాస్ట్ మూవీ ‘శంకరాభరణం’ ఫ్లాప్ అయిన నేపథ్యంలో తన మీద తాను సెటైర్ వేసుకుంటూ నిఖిల్ ఈ డైలాగ్ చెప్డడం విశేషమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/