టాలీవుడ్ లో ఈమద్య కాలంలో చిన్న చిత్రాలకు మంచి ఆధరణ దక్కుతుంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కించి, మంచి టైంలో సినిమాను రిలీజ్ చేస్తే భారీగా లాభాలు దక్కించుకోవచ్చు అంటూ ఇటీవల విడుదలైన పలు చిన్న చిత్రాలు నిరూపించాయి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేరాఫ్ కంచరపాలెం చిత్రం కూడా అదే తరహాకు వస్తుందని చెప్పుకోవచ్చు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మించిన కేరాఫ్ కంచరపాలెం చిత్రంను సురేష్ ప్రొడక్షన్స్ లో రానా సమర్పించడంతో మంచి బిజినెస్ అయ్యింది. దాంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
కేరాఫ్ కంచరపాలెం ఇన్సిపిరేషన్ తో ఎంతో మంది ఎన్నారైలు ప్రస్తుతం మంచి దర్శకుల కోసం అన్వేషిస్తున్నారు. తమ వద్ద ఉన్న డబ్బును సినిమా ఇండస్ట్రీలో పెట్టి గుర్తింపుకు గుర్తింపు డబ్బుకు డబ్బు సంపాదించొచ్చు అనే ఉద్దేశ్యంతో ఎన్నారైలు పలువురు టాలీవుడ్ పై దృష్టి పెడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. షార్ట్ ఫిల్మ్స్ తో గుర్తింపు దక్కించుకున్న దర్శకులను వెదికి పట్టుకునేందుకు ఎన్నారైలు తాపత్రయ పడుతున్నారు. ట్యాలెంటెడ్ దర్శకులతో రెండు కోట్ల లోపు బడ్జెట్ తో సినిమాలను నిర్మించేందుకు ఎంతో మంది ఎన్నారైలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
గతంలో చిన్న చిత్రాలకు పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కాని ఇప్పుడు బడ్జెట్ తో సంబంధం లేకుండా మంచి స్టఫ్ ఉన్న సినిమాలను తీస్తే ప్రతి ఒక్కరు ఆధరిస్తున్నారు. భారీగా విడుదల చేసేందుకు పెద్ద నిర్మాతలు సైతం ముందుకు వస్తున్నారు. దిల్ రాజు - అల్లు అరవింద్ - సురేష్ బాబు వంటి వారు ఈమద్య వరుసగా చిన్న చిత్రాలను సమర్పించేందుకు ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. అందుకే సినిమా నిర్మించి - వారికి చూపించి - వారితో ప్రమోట్ చేయించాలనే ఉద్దేశ్యంతో ఎన్నార ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు తెర లేవడం ఆనందించదగ్గ విషయం.