ఓవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ప్రకటన కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు అతడి అభిమానులు. ఇదిగో అదిగో అంటూనే ఎనిమిది నెలలు గడిపేశారు. ఇంకా కూడా మహేష్ కొత్త సినిమా టైటిల్ సంగతి తేలలేదు. ఐతే మరో టాలీవుడ్ బడా హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన అభిమానుల్ని అలా నిరీక్షింపజేయాలని అనుకోవట్లేదు. షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే ఈ సినిమా టైటిల్ ప్రకటించేయబోతున్నారు. ఈ నెల ఐదో తారీఖున ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ లోగో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటన వచ్చేసింది. స్వయంగా నిర్మాత నందమూరి కళ్యాణ్ రామే ఈమేరకు ప్రకటన చేశాడు.
ఏప్రిల్ 5న శ్రీరామనవమి కానుకగా ఉదయం 10.30 గంటలకు ఎన్టీఆర్ 27వ సినిమా లోగో లాంచ్ జరుగుతుందని ట్విట్టర్లో వెల్లడించాడు కళ్యాణ్ రామ్. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టైటిలే ఖాయమని.. అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఐతే ఈ టైటిల్ ఎలా డిజైన్ చేశారన్నదే చూడాలిక. ఇందులో తారక్ జై.. లవ.. కుశ అనే మూడు పాత్రల్ని పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది దశాబ్దం కిందట తమిళంలో అజిత్ హీరోగా కె.ఎస్.రవికుమార్ రూపొందించిన ‘వరలారు’కు రీమేక్ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఐతే ఈ ప్రచారంపై చిత్ర బృందం ఇప్పటిదాకా ఏమీ మాట్లాడలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/