నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ లో అంతా సెంటిమెంట్ తో నిండిపోయింది. టైటిల్ లోనే సెంటిమెంట్ ఉండడం, ఫాదర్ సెంటిమెంట్ కావడం.. ఈ ఫంక్షన్ కి ఎన్టీఆర్ సోదరుడు - హీరో కళ్యాణ్ రామ్ - తండ్రి హరికృష్ణ కూడా అటెండ్ కావడంతో.. మరింతగా ఆకట్టుకుంది.
సుకుమార్ తన తండ్రికి నివాళిగా ఈ సినిమా స్టోరీ రాశాడని చెప్పి ఎన్టీఆర్ మనసును హత్తుకునే మాటలు మాట్లాడాడు. అలాగే డీఎస్పీ తన తండ్రి మరణించినా, మ్యూజిక్ కంప్లీట్ చేసి ఎంతో త్యాగం చేశాడని కూడా చెప్పాడు. సుకుమార్ - డీఎస్పీ - కళ్యాణ్ రామ్ - తాను.. అంతా తండ్రి అంటే పడి చచ్చిపోయే పిల్లలమని అన్నాడు ఎన్టీఆర్. అంతకు ముందు స్టేజ్ పై.. కళ్యాణ్ రామ్ మాట్లాడాడు. తమ తండ్రి హరికృష్ణను... ఆయన తన తండ్రి ఎన్టీఆర్ ను చూసుకున్నంత గొప్పగా చూసుకోలేకపోతున్నామని అన్నాడు కళ్యాణ్ రామ్.
తండ్రి కోసం తన జీవితాన్ని మొత్తం ధారపోసిన వ్యక్తి హరికృష్ణ అని, అంతటి గొప్ప వ్యక్తికి కొడుకులుగా పుట్టడం తనకు, ఎన్టీఆర్ కు పూర్వజన్మ సుకృతం అన్నాడు. అసలు.. ఆయన అందరు కుమారుల్లోకి బెస్ట్ సన్ హరికృష్ణ అన్నాడు కళ్యాణ్ రామ్. తండ్రి ఎన్టీఆర్ కోసం హరికృష్ణ చేసిన కొన్ని త్యాగాలను వివరించాడు. ఈ ఫంక్షన్ లో తండ్రి హరికృష్ణకు.. ఎన్టీఆర్ పాదాభివందనం చేయడం అందరినీ ఆకట్టుకుంది.