రెండు మూడు నెలలుగా బుల్లి తెర ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్క తెలుగు సినిమా ప్రియుడు ఎదురు చూసిన మహేష్ బాబు స్పెషల్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు తాజాగా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్ ను చూశారు. జెమిని టీవీ వర్గాల వారి ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం భారీ ఎత్తున ఈ షో ను తిలకించినట్లుగా తెలుస్తోంది.
ఈ సీజన్ లోనే ఈ ఎపిసోడ్ కు అత్యధిక రేటింగ్ రాబోతున్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ లు కేవలం గేమ్ మాత్రమే ఆడకుండా ఇద్దరు కలిసి చాలా సరదాగా ముచ్చటించుకున్నారు. ఎన్టీఆర్ కు సంబంధించిన పలు విషయాలను గురించి ఎన్టీఆర్ అడిగి తెలుసుకుని ప్రేక్షకులకు తెలియజేశాడు.
మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ లు డైట్ గురించి చర్చ వచ్చిన సమయంలో కృష్ణ బాగా ఆహార ప్రియుడు అన్నట్లుగా మాట్లాడుకున్నారు. అదే సమయంలో మహేష్ మాట్లాడుతూ తనకు హోమ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అమ్మమ్మ వండిన ఫుడ్ అంటే నాకు ఇష్టం అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.
హైదరాబాదీ బిర్యానీ అంటూ ఎప్పటికి ఇష్టం అన్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నాడు. ఇక బాస్కెట్ బాల్ అంటే చాలా ఇష్టమని మహేష్ చెప్పాడు. స్కూల్ లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడేవాడిని అన్నాడు. ఒక సారి మనం కలిసి క్రికెట్ ఆడుదాం అంటూ ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేయగా మహేష్ బాబు అందుకు ఓకే అన్నాడు. ఇప్పుడు తన కొడుకు స్నేహితులతో కలిసి ఫుట్ బాల్ లీగ్ లు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నేను వారితో కలిసి చూస్తున్నాను అన్నాడు.
తనకు ఒక్కడు సినిమాలోని ప్రతి ఒక్క పాట చాలా ఇష్టం. ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బం అన్నట్లుగా ఒక్కడు సినిమా పాటలను చెప్పాడు. తాను నాలుగెళ్ల వయసులో నటించిన అవే కళ్లు సినిమాలోని మా ఊళ్లో ఒక పడుచుంది అనే పాట ఉంది. ఆ పాట అంటే ఇప్పటికి కూడా ఇష్టం అన్నట్లుగా మహేష్ బాబు పేర్కొన్నాడు.
మొత్తానికి మహేష్ బాబు మరియు ఎన్టీఆర్ లు కలిసి షో లో ఆట ఆడుతూ చాలా విషయాలను ముచ్చటించుకున్నారు. ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకర మాట్లాడుతూ ప్రేక్షకులకు తెలిసేలా చేశారు. మహేష్ బాబు గురించి గతంలో ఎవరికి తెలియని విషయాలు కూడా ఈ షో ద్వారా తెలిశాయి.