మామూలుగా 'మనం' అని ఎవరైనా స్టార్ హీరో అన్నాడంటే.. అది తనను తాను గౌరవించుకుని గర్వంతో 'నేను' అనకుండా 'మనం' అంటున్నాడు అని మనం అర్ధంచేసుకోవచ్చు. కాని కొందరు హీరోలు మాత్రం ఈ మనం విషయంలో చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవి ఉన్నారనుకోండి.. ఆయన తన మీద తాను సెటైర్ వేసుకోవడానికి 'మనం' అని వాడుతుంటారు. ఆ మధ్య ఒక ఇంటర్యూలో యాంకర్ ఆయన్ను.. సార్ పాలిటిక్స్ లోకి వచ్చాక కాస్త కలర్ తగ్గారే అని అడిగితే.. ''మనం ఏమన్నా మాంచి కలర్ ఏంటండీ.. నల్లబడిపోయాం అని ఫీలవ్వడానికి'' అన్నారు. అంత సింప్లిసిటీ ఉన్న మనిషి. ఇక ప్రస్తుత హీరోల గురించి ప్రస్తావన వస్తే.. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలి.
నిన్న ఒక ఇంటర్యూ లో మాట్లాడుతూ.. ఎవరు ఎన్టీఆర్ కాదు.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ''తారక్ ను ఒక పదిహేనళ్ల నుండి దగ్గరగా చూశాను. తను బాగా ఎమోషనల్ మనిషి...'' అంటుండగా.. ''ఏ నువ్వు కాదా??'' అంటూ కట్ చేశాడు ఎన్టీఆర్. ''ఆ నేను కూడా'' అని రాజీవ్ చెప్పడంతో.. ''మరి తను.. హీ ఈజ్ ఎమోషనల్ అంటావేంటి.. వుయ్ ఆర్ అను.. మనం అను.. రాజా'' అంటూ రాజీవ్ కు సలహా ఇచ్చాడు. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఒకటి అర్ధమైంది. అంత పెద్ద స్టార్ అయినా కూడా స్టూడెంట్ నెం.1 సినిమా నుండి రాజీవ్ తో ఉన్న అనుబంధంతో.. అసలు రాజాను తారక్ ఎంతగా ప్రేమిస్తాడో తెలిసింది. అలా రాజీవ్ ను 'మనం' అంటూ కలపుకుంటూ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే.. అద్భుతంగా ఉంది. స్నేహమంటే ఇదేరా!!