దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బంధిఖానా నుంచి టైగర్ అండ్ చీటా విడుదలయ్యాయి. మూడేళ్లుగా బాహుబలుని బంధిఖానాలో చిక్కుకుని బయటపడలేని పరిస్థితి. ఎట్టకేలకు స్వేచ్ఛగా ఎగిరిపోయేందుకు ఉత్సాహపడ్డాయి టైగర్ .. చీటా. అందుకు సంబంధించిన అరుదైన దృశ్యం తాజాగా సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త మాట్ బ్లాక్ లంభోర్ఘిణి కార్ లో రయ్ మంటూ ఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుంచి వెళుతుంటే ఆ వెంటే రెడ్ కలర్ ఫెరారీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ టీమ్ కి సెండాఫ్ చెబుతూ వెళ్లిన దృశ్యం హాట్ టాపిక్ గా మారింది. ఇది అరుదైన ఆహ్లాదకరమైన దృశ్యం. ఖరీదైన కార్లు రెండూ రయ్ మంటూ దూసుకెళుతుంటే స్వేచ్ఛా విహంగాల్ని తలపించాయి. టైగర్ ని అనుసరిస్తూ అడవిలో చీటా పరుగు పెడుతున్నట్టే ఆ దృశ్యం కనిపించింది.
ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీమ్ గా.. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ నిన్న మొత్తం షూటింగ్ పూర్తి చేసేసారు. అనంతరం తమ కార్లలో ఇంటికి వెళ్లారు. టీమ్ RRR ఇన్ స్టాగ్రామ్ పేజీ వీడియో క్లిప్ లో ఈ అరుదైన దృశ్యం ఆకట్టుకుంది. ఇందులో తారక్ - చరణ్ ఇద్దరూ తమ చివరి షాట్ పూర్తి చేసిన తర్వాత RRR సెట్ నుంచి తమ కార్లలో నిష్కృమించారు.
``టైగర్ - చీటా ... ఈ రోజు చివరి షాట్ పూర్తి చేసిన తర్వాత సెట్ నుండి నిష్క్రమించాయి!`` అని ఇన్ స్టాలో వ్యాఖ్యను ఆ వీడియోకి జోడించారు. తారక్ కొత్తగా కొనుగోలు చేసిన లంబోర్ఘిని ఉరుస్ లో వెళుతుంటే.. చరణ్ తన జెట్ రెడ్ ఫెరారీ లో రయ్ మంటూ దూసుకెళ్లారు. ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరూ దాదాపు 3 సంవత్సరాలుగా RRR మేకింగ్ కోసమే సమయం కేటాయించిన సంగతి తెలిసిందే.
RRR రాక కోసం చాలా కాలంగా అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఫ్రాంఛైజీ సినిమాలతో సంచలనాలు సృష్టించిన రాజమౌళి మరోసారి మ్యాజిక్ చేస్తారన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లోనూ ఉంది. కానీ ఇప్పటివరకూ ఈ సినిమా షూటింగ్ రకరకాల ఇబ్బందుల నడుమ చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఉక్రెయిన్ లో RRR ప్రధాన షెడ్యూల్ పూర్తయింది. చిత్రబృందం ఇటీవల హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. నిర్మాతలు ఇంతకుముందే ఓ ప్రకటనను విడుదల చేసారు.
కొన్ని పికప్ షాట్ లు మినహా RRR మొత్తం షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో మరికొన్ని అప్ డేట్స్ ని అందిస్తాం... అని ప్రకటించారు. దీంతో RRR బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకూ దసరా బరిలో RRR అక్టోబర్ 13 న విడుదల చేస్తారనే భావిస్తున్నారు. కానీ షూటింగ్ ఆలస్యమవ్వడంతో రిలీజ్ తేదీ మారుతుందని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే దీనిపై దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కానీ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.
టాకీ పూర్తవ్వడంతో ఎస్ఎస్ రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై తన దృష్టిని మరల్చి సినిమా ప్రచార ప్రణాళికను రూపొందిస్తారు. ఇకపై రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇద్దరూ తమ తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. చరణ్ తదుపరి శంకర్ తో సినిమాని ప్రారంభించేందుకు రెడీ అవుతుండగా.. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లలో ఉన్నారు.
సెకండ్ వేవ్ అనంతరం అనంతరం సన్నివేశం అంతా కొత్తగా ఉంది. సల్మాన్ - రాధే.. అక్షయ్ కుమార్ - బెల్ బాటమ్ చిత్రాలు అంతంత మాత్రంగానే వసూలు చేయడం నిజంగా నిరాశను కలిగించింది. రాధే ఫ్లాపైనా బెల్ బాటమ్ కి వచ్చిన మంచి సమీక్షల దృష్ట్యా భారీ వసూళ్లను సాధించాలి. కానీ ఆశించిన స్థాయికి ఇది చేరలేకపోయింది. దానికి కారణం ఇంకా ప్రజలు ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు ఆసక్తిగా లేకపోవడమే. అందుకే 2021 మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీపై చిత్రబృందం మరోసారి అధికారికంగా ప్రకటించేవరకూ సస్పెన్స్ తప్పేట్టు లేదు. వాయిదానా.. యథాతథంగా చెప్పిన తేదీకే రిలీజవుతుందా? అన్నది ప్రకటించాల్సి ఉంటుంది.