ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలోని `అరవింద సమేత` అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్- రాధాకృష్ణ ఎన్నోహోప్స్ తో ఎంతో ఛాలెంజింగ్ గా తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలని దర్శకనిర్మాతలు భావించి ఎంతో పకడ్భందీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాకి సంబంధించి లీకులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆన్ లొకేషన్ ఫోన్లను ఎలో చేయలేదు. అంత చేసినా ఈ సినిమాకి ఊహించని రీతిలో లీకుల బెడద తప్పలేదు.
సినిమా ఆరంభం నుంచి `అరవింద సమేత`కు సంబంధించి రకరకాల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. ఎన్టీఆర్ గెటప్ - నాగబాబు రోల్ ఏంటి? అసలు ఈ సినిమా కథ ఎలా ఉంటుంది? లాంటి విషయాలు లీకైపోయాయి. మూవీ కంటెంట్ ఏంటో ప్రతిదీ జనాలకు తెలిసిపోయేంత విషయం లీకైపోయింది. అంత పెద్ద సినిమాకి సంబంధించిన రహస్యాలు ఇలా లీకవ్వడంపై టీమ్ తలపట్టుకుంది. ఇలాంటి లీకుల వల్ల జనంలో క్యూరియాసిటీ పోతుందన్న బెంగ దర్శకనిర్మాతలను కంగారు పెట్టిందిట.
రీసెంటుగా `గీతగోవిందం` లీకుల నేపథ్యంలో అరవింద టీమ్ కు ఇదే టెన్షన్ పట్టుకుంది. కేవలం ఫోటోలే కాదు - తాజాగా 3 నిమిషాల రా ఫుటేజ్ ఆన్ లైన్ లో ప్రత్యక్షం కావడంతో టీమ్ మరోసారి షాక్ తింది. దాంతో ఈ లీకేజీ వ్యవహారంపై నిర్మాత రాధాకృష్ణ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్వెస్టిగేషన్ లోకి దిగిన పోలీసులు ఇది డాటా డిజిటల్ బ్యాంక్ వర్కర్ పనేనని కనిపెట్టేశారు. అరవింద సమేత డేటా మేనేజ్ మెంట్ చూస్తున్న వ్యక్తి ఇదంతా చేశాడని చెబుతున్నారు. అయితే గాలిస్తున్న పోలీసులకు చిక్కకుండా సదరు వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడుట. పోలీసులు ఇంకా సదరు లీకురాయుడి కోసం వెతుకుతున్నారు. మరోవైపు `అరవింద సమేత` చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.