ఎన్టీఆర్ తాజా చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ' టైట్ డెడ్ లైన్స్ తో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సినిమాలో కొంత టాకీ పార్ట్ - మూడు పాటల చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఇక రిలీజ్ కు 35 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో త్రివిక్రమ్ & టీమ్ ప్లానింగ్ మార్చారట.
మిగిలిన మూడు పాటల్లో ఒక పాటను మాత్రం యూరోప్ లో చిత్రీకరిస్తారట. మిగతా రెండు పాటలను హైదరాబాద్ లో నే సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతారట . సెప్టెంబర్ 20 కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి మిగతా పది రోజుల్లో రెండు పాటలను ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ ను వెంటనే మొదలు పెట్టి విదేశాల్లో చిత్రీకరించిన పాటను లాస్ట్ మినిట్ లో సినిమాలో కలిపేలా ప్లాన్ చేసుకున్నారట.
ఒక్క పాటైనా ఫారెన్ లొకేషన్ లో లేకపోతే ప్రేక్షకులకు సినిమాను త్వరగా చుట్టేసిన భావన కలుగుతుందని కాబట్టి ఆ పాటను మాత్రం ఎగ్జోటిక్ లోకేషన్స్ లో చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే సంగీత దర్శకుడు థమన్ అర్థంకాని సంగీత భాషలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పేజీలు ట్విట్టర్ లో పోస్ట్ చేసి వర్క్ చేస్తున్నానని తెలిపాడు. ఇక ఈ పాట ట్యూన్ లను కూడా సంగీత భాషలో రాయడం మొదలు పెట్టే ఉంటాడు!