అర‌వింద స‌మేత‌`కు గుమ్మ‌డికాయ‌

Update: 2018-08-01 08:10 GMT
ఎన్టీఆర్‌ - త్రివిక్ర‌మ్ హైస్పీడ్‌లో వెళుతున్నారు. వీళ్ల‌కు బ్రేకులేసేవాళ్లే లేరు. అడ్డూ ఆపూ లేకుండా హైవేలో వెళుతున్నారు. ఇక  త్రివిక్ర‌ముని స్పీడేంటో కానీ ఈసారి ఎట్టి ప‌రిస్థితిలో  ట్రాక్ లోకి వ‌చ్చేందుకు క‌సిగా ట్రై చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం `అర‌విందస‌మేత‌` హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో తెర‌కెక్కుతోంది. ఆన్ లొకేష‌న్ స్పాట్ బాయ్ అందించిన స‌మాచారం ప్ర‌కారం..

ఇక ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ మెజారిటీ పార్ట్ పూర్త‌యిపోయింది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ గా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్టీఆర్‌ లో చూడ‌ని ఓ కొత్త కోణాన్ని త్రివిక్ర‌ముడు తెర‌పై ఆవిష్క‌రిస్తున్నార‌ట‌. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌ డ్రాప్ లో మునుపెన్న‌డూ చూడ‌నంత గ‌గుర్పొడిచే యాక్ష‌న్‌ తో ఇర‌గ‌దీస్తుంద‌ని తెలుస్తోంది. ఎమోష‌న్స్ ప‌రంగా పీక్స్ ని చూస్తార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు ఈ సినిమాకు గుమ్మ‌డి కాయ కొట్టే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న వార్త అందింది. మ‌హా అయితే ఇంకో 45రోజులే. సెప్టెంబ‌ర్ 15న‌ గుమ్మ‌డికాయ కొట్టేస్తున్నారు. అటుపై అన్నిప‌నులు పూర్తి చేసి - అక్టోబ‌ర్ 10న ద‌స‌రా కానుక‌గా సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. విదేశాల్లో ఓ పాట‌ను చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్ విదేశాల‌కు వెళుతోందిట‌.
Tags:    

Similar News